Thug life twitter review: ఆ మ్యాజిక్ మ‌ళ్లీ రిపీట్ అయ్యిందా? థ‌గ్ లైఫ్ ట్విట్ట‌ర్ రివ్యూ

Thug life twitter review: ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు మణిరత్నం, లెజెండరీ నటుడు కమల్ హాసన్ కాంబినేషన్‌లో వచ్చిన "థగ్ లైఫ్" ఈరోజు (జూన్ 5) ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేసింది. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత క‌మ‌ల్‌, మ‌ణిర‌త్నం కాంబినేష‌న్‌లో వ‌చ్చిన సినిమా ఎలా ఉంది. సినిమా చూసిన ప్రేక్ష‌కులు ఏమంటున్నారు.

Update: 2025-06-05 05:59 GMT

Thug life twitter review: ఆ మ్యాజిక్ మ‌ళ్లీ రిపీట్ అయ్యిందా? థ‌గ్ లైఫ్ ట్విట్ట‌ర్ రివ్యూ

Thug life twitter review: ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు మణిరత్నం, లెజెండరీ నటుడు కమల్ హాసన్ కాంబినేషన్‌లో వచ్చిన "థగ్ లైఫ్" ఈరోజు (జూన్ 5) ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేసింది. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత క‌మ‌ల్‌, మ‌ణిర‌త్నం కాంబినేష‌న్‌లో వ‌చ్చిన సినిమా ఎలా ఉంది. సినిమా చూసిన ప్రేక్ష‌కులు ఏమంటున్నారు. లాంటి వివ‌రాలు ట్విట్ట‌ర్ రివ్యూలో చూద్దాం.

ఈ సినిమా చూసిన ఆడియన్స్ తమ స్పందనను ట్విట్టర్ వేదికగా పంచుకుంటున్నారు. “ఇంటర్వెల్ సీన్‌ గూస్‌బంప్స్‌! మణిరత్నం మాస్టర్రూ ” అంటూ ఒక యూజ‌ర్ కామెంట్ చేశాడు. దీంతో మ‌ణిర‌త్నం త‌న ద‌ర్శ‌కత్వంలో మ‌రోసారి ప్రేక్షకుల‌ను మెస్మరైజ్ చేశార‌న్న విష‌యం స్ప‌ష్ట‌మ‌వుతోంది.

మ‌రో యూజ‌ర్ స్పందిస్తూ.. “శింబు పర్ఫార్మెన్స్ హైలైట్! ప్రతి సీన్‌లో జీవించాడు అని తెలిపాడు. ఇక “కమల్ హాసన్ స్క్రీన్ ప్రెజెన్స్‌కు హ్యాట్సాఫ్… కొత్త మేనరిజం, కొత్త ఎనర్జీ!గా ఉందంటూ మ‌రో యూజ‌ర్ స్పందించాడు.

దర్శకుడు మణిరత్నం మార్క్ మేకింగ్ మరోసారి రుజువైందని అంటున్నారు.

సినిమా విజువల్ గ్రాండియర్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, టెక్నికల్ రిచ్‌నెస్ అన్నీ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయని అభిప్రాయపడుతున్నారు. త్రిష తన స్టైలిష్ లుక్స్‌తో ఆకట్టుకుందని కొంద‌రు అభిప్రాయ‌ప‌డుతున్నారు. మొత్తం మీద థగ్ లైఫ్ ఒక మంచి సినిమా అంటూ నెటిజ‌న్లు స్పందిస్తున్నారు. 



Tags:    

Similar News