Thug Life OTT: అప్పుడే ఓటీటీలోకి థగ్ లైఫ్.. స్ట్రీమింగ్ ఎందులో అంటే
Thug Life OTT: థగ్ లైఫ్ విషయంలోనూ అదే జరగబోతోందని టాక్. నెట్‌ఫ్లిక్స్ ఇప్పటికే చిత్ర యూనిట్‌తో చర్చలు ప్రారంభించి, సినిమాను 4 వారాలకే స్ట్రీమ్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. సినిమా జూలై మొదటివారంలోనే నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
Thug Life OTT: అప్పుడే ఓటీటీలోకి థగ్ లైఫ్.. స్ట్రీమింగ్ ఎందులో అంటే
Thug Life OTT: లోక నాయకుడు కమల్ హాసన్ ప్రధాన పాత్రలో నటించిన భారీ బడ్జెట్ చిత్రం ‘థగ్ లైఫ్’ బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయం సాధించలేక పోయింది. సుమారు 35 ఏళ్ల తర్వాత మణిరత్నంతో కలిసి వచ్చిన ఈ చిత్రం, ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమైంది. భారీ అంచనాల మధ్య జూన్ 5న విడుదలైన ఈ సినిమా, మొదటి వారం నుంచే కలెక్షన్ల పరంగా వెనుకబడిపోయింది.
రాజ్‌కమల్ ఇంటర్నేషనల్, మద్రాస్ టాకీస్, రెడ్ జెయింట్ మూవీస్ బ్యానర్లపై ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇందులో త్రిషా, శింబు, ఐశ్వర్య లక్ష్మి, అశోక్ సెల్వన్, నాజర్, పంకజ్ త్రిపాఠి, అలీ ఫజల్, తనికెళ్ల భరణి తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు.
అనుకున్న సమయం కంటే ముందే ఓటీటీలో
సాధారణంగా ఓటీటీ సంస్థలు థియేట్రికల్ రిలీజ్ తర్వాత 8 వారాల గ్యాప్ తర్వాత సినిమాను స్ట్రీమ్ చేయడానికి ఒప్పుకుంటాయి. అయితే, బాక్సాఫీస్ రిజల్ట్ తేడా కొట్టిన సమయంలో కొన్ని సినిమాలను ముందే విడుదల చేయడానికి ఒప్పందాలు జరిగే అవకాశం ఉంటుంది.
థగ్ లైఫ్ విషయంలోనూ అదే జరగబోతోందని టాక్. నెట్‌ఫ్లిక్స్ ఇప్పటికే చిత్ర యూనిట్‌తో చర్చలు ప్రారంభించి, సినిమాను 4 వారాలకే స్ట్రీమ్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. సినిమా జూలై మొదటివారంలోనే నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
ఇదిలా ఉంటే.. ఈ సినిమా విడుదల సందర్భంగా కర్ణాటకలో వివాదాస్పద పరిణామాలు చోటు చేసుకున్నాయి. అక్కడ కొన్ని సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేయడంతో, నిషేధం వంటి పరిస్థతులు ఎదురయ్యాయి. దీంతో కొన్నిచోట్ల కోర్టు కేసుల నేపథ్యంలో స్క్రీనింగ్ ఆగిపోయింది.
ఇక ఈ సినిమా తమిళనాడులో మాత్రమే ఈ సినిమా కొంతమేర 40 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. కానీ దేశం మొత్తంగా చూస్తే, సినిమా ప్రపంచవ్యాప్తంగా 90 కోట్ల రూపాయలకే పరిమితమైంది. దీంతో థియేటర్ రన్ త్వరగా ముగియనుందనే అంచనా వ్యక్తమవుతోంది.