Thudarum OTT: ఓటీటీని షేక్ చేస్తున్న క్రైమ్ థ్రిల్లర్.. ఎందులో స్ట్రీమింగ్ అవుతోందంటే
Thudarum OTT: మే 30వ తేదీ నుంచి జియో హాట్‌స్టార్ వేదికగా ‘తుడరమ్’ స్ట్రీమింగ్ ప్రారంభమైంది. స్ట్రీమింగ్ మొదలైన తొలి రోజు నుంచే ఈ సినిమా ట్రెండింగ్‌లో నిలిచింది.
Thudarum OTT: ఓటీటీని షేక్ చేస్తున్న క్రైమ్ థ్రిల్లర్.. ఎందులో స్ట్రీమింగ్ అవుతోందంటే
Thudarum OTT: ప్రస్తుతం ఓటీటీ వేదికగా ప్రేక్షకులను ఊపేస్తున్న మలయాళ క్రైమ్ థ్రిల్లర్ ‘తుడరమ్’. విడుదలకు ముందు ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా థియేటర్లలో సంచల విజయాన్ని అందుకుంది. ఏప్రిల్ 25న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా, మోహన్ లాల్ ప్రధాన పాత్రలో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.
మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్ రావడం వల్ల, ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సత్తాచాటింది. ప్రపంచవ్యాప్తంగా రూ.230 కోట్లు వసూలు చేసి, ఘన విజయాన్ని అందుకుంది. ఇక థియేటర్లలో సందడి చేసిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది.
మే 30వ తేదీ నుంచి జియో హాట్‌స్టార్ వేదికగా ‘తుడరమ్’ స్ట్రీమింగ్ ప్రారంభమైంది. స్ట్రీమింగ్ మొదలైన తొలి రోజు నుంచే ఈ సినిమా ట్రెండింగ్‌లో నిలిచింది. మలయాళంతో పాటు తెలుగు, హిందీ, తమిళం, కన్నడ భాషల్లో కూడా అందుబాటులోకి వచ్చింది. మల్టీ లాంగ్వేజ్ రిలీజ్ వల్ల, ఈ సినిమా దేశవ్యాప్తంగా ట్రెండ్ అవుతుంది. ఇప్పటికే మూడు భాషల్లో నేషనల్ లెవెల్‌లో టాప్ ట్రెండింగ్‌లో ఉంది.
మోహన్ లాల్ సరసన శోభన ముఖ్యపాత్ర పోషించగా, ఈ సినిమాలో మర్డర్, రివేంజ్ నేపథ్యంలో కథ కొనసాగుతుంది. తరుణ్ మూర్తి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే, ఎమోషనల్ ఎలిమెంట్స్, థ్రిల్లింగ్ ట్విస్టులు ప్రధాన బలంగా నిలిచాయి. ప్రకాష్ వర్మ, బినూ పప్పు, థామస్ మాథ్యూ, అమృత వర్షిని కీలక పాత్రల్లో నటించారు. కేరళ రాష్ట్రంలో రూ.100 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించిన తొలి చిత్రంగా ‘తుడరమ్’ రికార్డు సృష్టించింది.