OTT Movie: వీడి కంట అమ్మాయి పడితే చాలు..సొంత కోడల్ని కూడా వదలని దుర్మార్గుడు
OTT Movie: సరిగా ఉపయోగించుకోవాలే కానీ ఓటీటీలో లెక్కకు మించిన ఎంటర్ టైన్ మెంట్ దొరుకుతుంది.
OTT Movie: వీడి కంట అమ్మాయి పడితే చాలు..సొంత కోడల్ని కూడా వదలని దుర్మార్గుడు
Thimiram Movie Streaming on NeeStream
OTT Movie: సరిగా ఉపయోగించుకోవాలే కానీ ఓటీటీలో లెక్కకు మించిన ఎంటర్ టైన్ మెంట్ దొరుకుతుంది. ఎలాంటి కంటెంట్ కావాలన్న ఓ సమయంలో కావాలన్న చూడొచ్చు. అంతే కాకుండా ఇటీవల కాలంలో ఓటిటి ప్లాట్ ఫామ్ లో మలయాళ సినిమాలకు మంచి ఫాలోయింగ్ దొరుకుతుందిజ మంచి కథలను చక్కగా తెరకెక్కిస్తున్నారు వాటి మేకర్స్. ఇప్పుడు మనం తెలుసుకోబోయే సినిమాలో ఒక వ్యక్తి ఆడవాళ్లు, మగవాళ్ల కన్నా తక్కువనే ఫీలింగ్ లో ఉంటాడు. పడక సుఖం కోసమే వీళ్లు ఉంటారన్న భావనతో బతుకుతుంటాడు. ఆడవాళ్లను అదే దృష్టితో చూస్తూ ఉంటాడు. ఈ వ్యక్తి చుట్టూ కథ తిరుగుతుంది.
ఈ మలయాళం సినిమానే ‘తిమిరం’. 2019 లో విడుదల అయిన ఈ సినిమా శివరామ్ మోనీ డైరెక్షన్లో వచ్చింది.ఇందులో కె.కె. సుధాకరన్, విశాక్ నాయర్, మీరా నాయర్ కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా 18వ చెన్నై ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో కూడా స్ట్రీమింగ్ అయింది. ఈ మూవీ ప్రస్తుతం నీ స్ట్రీమ్ (Nee Stream), సైనా ప్లే (Saina play) లో స్ట్రీమింగ్ అవుతుంది.
కథలోకి వెళితే సుధాకర్ ను అతని తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి మగవాళ్లు ఎక్కువ, ఆడోళ్లు తక్కువ అన్నట్లు పెంచుతాడు. కొడుకును అల్లారుముద్దుగా చూసుకుంటూ.. కూతురిని పట్టించుకోడు. అలా పెద్దయ్యాక సుధాకర్ కి ఒక అలవాటు ఉంటుంది. ఎవరైనా ఏకాంతంగా గడుపుతూ ఉంటే వాళ్లను దొంగ చాటుగా చూస్తుంటాడు. వర్తమానంలో తను 70ఏళ్ల వయసు వస్తుంది. అతనికి రామ్ అనే కొడుకు, వందన అనే కోడలు ఉంటుంది. వీళ్ళిది ప్రేమ వివాహం కావడంతో కట్నం లేకుండానే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు రామ్. సుధాకర్ ఈ విషయం మీద చాలా అసహనంగా ఉంటాడు. ఉంటాడు. మీ వల్ల నాకు ఖర్చులు పెరుగుతున్నాయని చిరాకు పడతాడు. ఇతడు కొన్ని మసాలా ప్యాకెట్లు అమ్ముతూ డబ్బులు సంపాదిస్తాడు. ఈ క్రమంలో పుష్పమ్మ అనే మహిళతో సుధాకర్ అసభ్యంగా ప్రవర్తిస్తాడు. ఈ విషయం తెలిసిన పుష్పమ్మ కొడుకు అతడిపై కేసు పెడతాడు. కావాలనే తనను ఇరికించిందని, తాను ఆ ఉద్దేశంతో వెళ్లలేదని పోలీసులకు చెబుతాడు. పోలీసులు సుధాకర్ కి వార్నింగ్ ఇచ్చి పంపేస్తాడు.
మరోవైపు కొడుకు సినిమా కథలు రాస్తుంటాడు. ఒక సినిమా ఛాన్స్ వస్తే తన తండ్రికి కంటి ఆపరేషన్ చేయించాలని అనుకుంటాడు. అయితే ఇప్పుడు తండ్రి చేసిన పనికి బాగా అప్ సెట్ అవుతాడు. కోడలు తన నగలు అమ్మి సుధాకర్ కి కంటి ఆపరేషన్ చేయిస్తుంది. కంటి చూపు బాగా రావడంతో సంతోషం వ్యక్తం చేస్తాడు సుధాకర్. అయితే కొడుకు, కోడలు ఏకాంతంగా గడుపుతున్న టైంలో సుధాకర్ దొంగ చాటుంగ చూస్తాడు. ఈ విషయం కోడలికి తెలుస్తుంది. భర్తకు చెప్పి తన మామను ఏం చేస్తుందో చూడాలంటే సినిమా చూడాల్సిందే.