అస్సలు వివాదం ఉండదు నిజం! రాంగోపాల్ వర్మ

Update: 2019-08-08 08:27 GMT

ఏవండోయ్..విన్నారా? మన అర్జీవీ.. అదేనండీ రాంగోపాల్ వర్మ అస్సలు వివాదాలు లేని సినిమా తీస్తున్నారంట. మీరు నమ్ముతారా? ఏమో మరి అయన మాత్రం తను వివాదం లేని సినిమా తీస్తున్నానని ట్వీటారు. ఆ సినిమాకి సంబంధించిన మొదటి పాట.. మొదటి ట్రైలర్ రేపు విడుదల చేస్తారట. ఇదీ ఆయనే చెప్పారు. రేపు ఉదయం 9 అంటే 9 గంటలకు ఈ రిలీజ్ ఉంటుందట.

అన్నట్టు ఇంతకీ ఈ సినిమా పేరు చెప్పలేదు కదూ. అక్కడకే వస్తున్నాం. మొన్నామధ్య ఆయన లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా ప్రమోషన్ కి విజయవాడ వెళ్లారు గుర్తుంది కదూ. అప్పుడు ఆయనో సినిమా పేరు ఎనౌన్స్ చేశారు. అది కూడా గుర్తుందా. అయినా మా బాధ్యత కదా. చెబుతున్నాం. "కమ్మ రాజ్యంలో కడప రెడ్లు"! ఇప్పుడు చెప్పండి రాం గోపాల్ వర్మ రేపు రిలీజ్ చేసే సినిమా పాట వివాదం ఉన్న సినిమాకి సంబంధించిందో కాదో!




Tags:    

Similar News