Shah Rukh Khan: ప్రపంచంలోనే నాలుగో రిచెస్ట్ హీరో షారుఖ్ ఖాన్...ఆస్తులు ఎన్ని వేల కోట్లో తెలుసా ?

Shah Rukh Khan: బాలీవుడ్‌లో అత్యధిక పారితోషికం తీసుకునే స్టార్లలో షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, ఆమిర్ ఖాన్ ముందు వరుసలో ఉంటారు.

Update: 2025-08-01 06:11 GMT

Shah Rukh Khan: ప్రపంచంలోనే నాలుగో రిచెస్ట్ హీరో షారుఖ్ ఖాన్...ఆస్తులు ఎన్ని వేల కోట్లో తెలుసా ?

Shah Rukh Khan: బాలీవుడ్‌లో అత్యధిక పారితోషికం తీసుకునే స్టార్లలో షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, ఆమిర్ ఖాన్ ముందు వరుసలో ఉంటారు. అయితే, బాలీవుడ్‌లో అత్యంత రిచెస్ట్ హీరో ఎవరంటే అది షారుఖ్ ఖాన్‌. ఆయన మొత్తం ఆస్తి రూ.7,500 కోట్లు అని అంచనా. ఈయన మాత్రమే కాదు, ఆయన భార్య గౌరీ ఖాన్ కూడా తన వ్యాపారాల ద్వారా కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు.

బాలీవుడ్ సూపర్‌స్టార్‌లలో ఒకరైన షారుఖ్ ఖాన్ బాలీవుడ్‌లోనే అత్యంత సంపన్న నటుడు. ఆయన మొత్తం ఆస్తి రూ.7,500 కోట్లు. ఈ ఏడాది ఫిబ్రవరిలో స్క్వేర్ అనే మ్యాగజైన్ ప్రచురించిన ప్రపంచంలోని అత్యంత సంపన్న నటుల జాబితాలో టాప్ 10లో షారుఖ్ ఖాన్ పేరు ఉంది. గత కొన్ని దశాబ్దాలుగా ఈ జాబితాలో ఆయన పేరు కనిపిస్తూనే ఉంది. స్క్వేర్ ఇచ్చిన సమాచారం ప్రకారం.. షారుఖ్ ఖాన్ మొత్తం ఆస్తి రూ.7,500 కోట్లు. ఈ లెక్కల ప్రకారం, ఆయన ప్రపంచంలోనే నాలుగో రిచెస్ట్ హీరో.

షారుఖ్ ఖాన్ భార్య గౌరీ ఖాన్ కూడా తక్కువేం కాదు. ఆమె ప్రసిద్ధ ఇంటీరియర్ డిజైనర్. అలాగే అనేక ఇతర వ్యాపారాలు కూడా నడుపుతున్నారు. గౌరీ కూడా తన కష్టంతో కోట్ల రూపాయల ఆస్తిని సంపాదించారు. లైఫ్‌స్టైల్ ఏషియా అందించిన సమాచారం ప్రకారం.. గౌరీ ఖాన్ మొత్తం ఆస్తి రూ.1,600 కోట్లకు పైగానే ఉంటుంది. ముంబైలో ఆమెకు ఒక లగ్జరీ ఆఫీస్ ఉంది. దాని విలువ సుమారు రూ.150 కోట్లు ఉంటుందని చెబుతారు.

గౌరీ ఖాన్ ఇంటీరియర్ డిజైనింగ్ మాత్రమే కాదు, ఆమె ఒక ప్రసిద్ధ నిర్మాత కూడా. 2002లో షారుఖ్ ఖాన్‌తో కలిసి రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్ అనే నిర్మాణ సంస్థను స్థాపించారు. ముంబై, ఢిల్లీ, అలీబాగ్, లండన్, దుబాయ్, లాస్ ఏంజెల్స్‌లో వారికి కోట్లాది రూపాయల విలువైన లగ్జరీ ఇళ్లు ఉన్నాయి. గౌరీ ఒక లగ్జరీ రెస్టారెంట్‌ను కూడా నడుపుతున్నారు. షారుఖ్, గౌరీ ఖాన్ బాలీవుడ్ పరిశ్రమలోని అత్యంత సంపన్న జంటలలో ఒకరు.

Tags:    

Similar News