Project K: "ప్రాజెక్ట్ కే" గురించి బోలెడు అప్డేట్స్ ఇచ్చిన నిర్మాత

Project K: "ప్రాజెక్ట్ కే" షూటింగ్ గురించి అప్డేట్ ఇచ్చిన నిర్మాత

Update: 2023-02-25 14:00 GMT

Project K: "ప్రాజెక్ట్ కే" గురించి బోలెడు అప్డేట్స్ ఇచ్చిన నిర్మాత

Project K: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మరియు "మహానటి" ఫేమ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాంబినేషన్లో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమా "ప్రాజెక్ట్ కే". బాలీవుడ్ బ్యూటీ దీపికా పడుకొనే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సూపర్ నాచురల్ థ్రిల్లర్గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ఎలా ఉండబోతోంది అని అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న అశ్విని దత్ సినిమాకి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు.

ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. సంతోష్ నారాయణన్ ఈ సినిమాకి సంగీతాన్ని అందించబోతున్నట్లు అశ్విని దత్ ప్రకటించారు. ఇక షూటింగ్ విషయానికి వస్తే ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ 70 శాతం పూర్తయిందని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్న బాలీవుడ్ స్టార్ అమితాబచ్చన్ మరియు దీపికా పడుకొనే నటించాల్సిన కొన్ని సన్నివేశాలు షూటింగ్ ఇంకా పెండింగ్లో ఉందట. దీనికోసం పది రోజులపాటు షూటింగ్ జరగబోతోంది.

ఇక ఈ సినిమాకి విజువల్ ఎఫెక్ట్స్ కోసం ప్రపంచవ్యాప్తంగా ఐదు పెద్ద పేరు మోసిన కంపెనీలు పనిచేస్తున్నాయని అశ్విని దత్ పేర్కొన్నారు. ఇక ఆఫ్రికా, అమెరికా, మరియు ఇండియా నుంచి కొందరు స్టార్ స్టంట్ మాస్టర్లు ఈ సినిమా కోసం కొన్ని అద్భుతమైన ఫైట్ సీట్ సీక్వెన్స్ లు ప్లాన్ చేస్తున్నారు.

Tags:    

Similar News