బిగ్ బాస్ కు వ్యతిరేకంగా కోర్టును ఆశ్రయించిన వ్యక్తి..
* బిగ్ బాస్ ను బ్యాన్ చేయాలి అంటూ పిటిషన్ పెట్టిన వ్యక్తి
బిగ్ బాస్ కు వ్యతిరేకంగా కోర్టును ఆశ్రయించిన వ్యక్తి..
Bigg Boss Ban: తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో లలో ఒకటైన బిగ్ బాస్ ఇప్పటికే ఆరు సీజన్లు, ఒక ఓటీటీ సీజన్ ను పూర్తి చేసుకుంది. ఈ షో ద్వారా ఎంతో మంది పేరు కూడా తెలియని వాళ్ళు సెలబ్రిటీలుగా మారారు. అయితే తాజాగా ఇప్పుడు ఈ షోని బ్యాన్ చేయాలి అంటూ జగదీశ్వర్ రెడ్డి అనే ఒక వ్యక్తి ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించాడు. ఈ వార్త ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.
బిగ్ బాస్ షో వల్ల యువత తప్పుదారి పడుతుందని అందుకని ఎట్టి పరిస్థితుల్లోనూ బిగ్ బాస్ షోను ఆపేయాలని ఒక పిటిషన్ ద్వారా తన ఆవేదనను వ్యక్తం చేశాడు జగదీశ్వర్ రెడ్డి. కోర్టు కూడా ఈ పిటిషన్ స్వీకరించింది. ఇక ఇప్పుడు బిగ్ బాస్ నిర్వాహకులు కూడా ఈ పిటిషన్ కు కౌంటర్ పిటిషన్ వేయాల్సి ఉంటుంది. బిగ్ బాస్ షో ని ఎందుకు బ్యాన్ చేయాల్సిన అవసరం లేదో తెలియజేస్తూ బిగ్ బాస్ నిర్వహకులు కూడా కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాల్సి ఉంది. అది కూడా ఒక ఆరు వారాల సమయంలోనే జరగాలి. మరి ఈ విషయంలో బిగ్ బాస్ బృందం ఏం చేస్తుందో వేచి చూడాలి.
హాలీవుడ్ లో బిగ్ బ్రదర్ అని పేరుతో బాగా పాపులర్ అయిన ఈ రియాలిటీ షో ముందుగా హిందీలో బిగ్ బాస్ పేరుతో మొదలై దశాబ్ద కాలంగా సాగుతూనే ఉంది. తమిళ్, కన్నడ, మలయాళం లో కూడా మొదలైన బిగ్ బాస్ తెలుగులో కూడా ఆరు సీజన్ లు పూర్తి చేసుకుంది. మొదటి సీజన్ కు ఎన్టీఆర్ హోస్టుగా వ్యవహరించగా రెండవ సీజన్ కు నాని హోస్ట్ గా కనిపించారు. ఇక మూడవ సీజన్ నుంచి మొన్న పూర్తయిన ఆరవ సీజన్ వరకు నాగార్జున హోస్టుగా వ్యవహరిస్తున్నారు.