'ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో': కడుపుబ్బా నవ్వించే అద్భుతమైన కామెడీ విందు!
The Great Pre-Wedding Show: ఇటీవలి కాలంలో వచ్చిన అత్యుత్తమ కామెడీ చిత్రాల్లో 'ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో' ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది.
'ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో': కడుపుబ్బా నవ్వించే అద్భుతమైన కామెడీ విందు!
The Great Pre-Wedding Show: ఇటీవలి కాలంలో వచ్చిన అత్యుత్తమ కామెడీ చిత్రాల్లో 'ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో' ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ఎటువంటి అసభ్యత, బూతులకు తావు లేకుండా, పూర్తిగా సహజమైన హాస్యంతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తున్న ఈ చిత్రానికి అద్భుతమైన స్పందన లభిస్తోంది. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ ఇది "నవ్వుల బంతి భోజనం" అని కొనియాడటం విశేషం.
తిరువీర్ పర్‌ఫార్మెన్స్ సినిమాకు ప్రధాన బలం. 'మసూద', 'పలాస' వంటి విభిన్న చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న ఈ యువ కథానాయకుడు, ఈ సినిమాలో తనదైన కామెడీ టైమింగ్, నటనలో పరిపక్వతతో అందరినీ ఆకట్టుకున్నాడు. గ్రామీణ నేపథ్యం, అమాయకపు పాత్రల మధ్య పొరపాట్లు, పరిస్థితుల నుంచి పుట్టే హాస్యం ప్రేక్షకులను పూర్తిగా కట్టిపడేస్తోంది.
ఇలాంటి స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన కామెడీ సినిమాలు చాలా అరుదుగా వస్తుంటాయి. అందుకే, 'ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో'ను తప్పకుండా థియేటర్లలో చూడాల్సిన సినిమా అని సినీ విశ్లేషకులు, ప్రేక్షకులు ఏకగ్రీవంగా సిఫార్సు చేస్తున్నారు.
మౌత్ టాక్ (Mouth Talk) బలంగా ఉండటం వలన, నిన్నటి రోజు కంటే ఈ రోజు సినిమా బుకింగ్స్ మెరుగ్గా ఉన్నాయి. వసూళ్లు మరింత పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. తొలి చిత్ర దర్శకుడు రాహుల్ శ్రీనివాస్ కథనం, శ్రీకాకుళం మట్టివాసనతో కూడిన కామెడీని ప్రేక్షకులు హృదయపూర్వకంగా స్వీకరించారని రిపోర్టులు సూచిస్తున్నాయి.