Thandel Box Office Collections: తండేల్ వసూళ్ల సునామీ.. ఎన్నికోట్లంటే..?
తండేల్ సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీని సృష్టిస్తోంది. నాలుగు రోజుల్లో 73.20 కోట్ల కలెక్షన్స్ రాబట్టినట్టు మేకర్స్ తెలిపారు. ఈ మేరకు కలెక్షన్స్‌తో కూడిన స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు.
తండేల్ వసూళ్ల సునామీ.. ఎన్నికోట్లంటే..?
Tandel Collections: తండేల్ సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీని సృష్టిస్తోంది. నాలుగు రోజుల్లో 73.20 కోట్ల కలెక్షన్స్ రాబట్టినట్టు మేకర్స్ తెలిపారు. ఈ మేరకు కలెక్షన్స్‌తో కూడిన స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. నాగ చైతన్య కెరీర్‌లో హయ్యెస్ట్ ఓపెనింగ్స్‌ను రాబట్టిన మూవీగా తండేల్ రికార్డ్ క్రియేట్ చేసింది. రెండో వారంలో రూ.100 కోట్లు దాటే అవకాశం ఉందని బాక్సాఫీస్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
నాగ చైతన్య, సాయి పల్లవి హీరో, హీరోయిన్‌గా నటించిన చిత్రం తండేల్. చందూ మొండేటి దర్శకత్వంలో అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు తెరకెక్కించారు. అయితే మొదటి నుంచి సినిమాపై అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలను అందుకోవడంలో తండేల్ సక్సెస్ అయింది. అది వసూళ్ల రూపంలో కనిపిస్తోంది. నాలుగు రోజుల్లో 80 శాతానికి పైగా రికవరీ సాధించింది. ఇప్పటికే నైజాం ఏరియాలో మూవీ బ్రేక్ ఈవెన్‌ను సాధించినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. నైజాం ఏరియాలో పదిన్నర కోట్ల వరకు ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. నాలుగు రోజుల్లో ఒక్క నైజాం ఏరియాలోనే ఈ మూవీ 11 కోట్ల వసూళ్లను రాబట్టింది.
తండేల్ సినిమా మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా రూ.21 కోట్లకు పైగా వరల్డ్ వైడ్‌గా గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఇక రెండో రోజు ప్రపంచ వ్యాప్తంగా రూ.41.20 కోట్ల గ్రాస్ వసూళ్లు రాగా.. మూడో రోజు రూ.62.37 కోట్ల గ్రాస్ వసూళ్లతో కుమ్మేసింది. నాలుగు రోజుల్లో మొత్తంగా రూ.73.20 కోట్ల గ్రాస్ వసూళ్లు, రూ.38 కోట్ల షేర్‌తో బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుంది.
తండేల్ మూవీలో నాగచైతన్య సరసన సాయి పల్లవి హీరోయిన్‌గా నటించారు. మత్య్సకారుల జీవితాల నేపథ్యంలో ప్రేమకథకు, దేశభక్తిని ముడిపెడుతూ దర్శకుడు చందూ మొండేటి ఈ సినిమాను తెరకెక్కించారు. హీరోగా నాగ చైతన్యకు ఇది మొదటి రూ. 100 కోట్ల చిత్రంగా నిలవనుంది. ఈ చిత్రంలో నాగ చైతన్య, సాయిపల్లవి వారి వారి పాత్రల్లో ఒదిగిపోయారు. వీరిద్దరి కెమిస్ట్రీకి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. వీరి యాక్టింగ్‌తో పాటు దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ బాగుందంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.