ఏడిద గోపాల రావు ఇక లేరు!

ఆకాశవాణి న్యూఢిల్లీ కేంద్రంగా వార్తలు చదివిన ఏడిద గోపాలరావు మృతి చెందారు. ఆయన వయస్సు ప్రస్తుతం 83 సంవత్సరాలు. న్యూఢిల్లీ ఆకాశవాణిలో న్యూస్ రీడర్ గా ఏడిద గోపాలరావుకు 30 ఏళ్లగా పనిచేశారు.

Update: 2020-11-12 13:43 GMT

ఆకాశవాణి న్యూఢిల్లీ కేంద్రంగా వార్తలు చదివిన ఏడిద గోపాలరావు మృతి చెందారు. ఆయన వయస్సు ప్రస్తుతం 83 సంవత్సరాలు. న్యూఢిల్లీ ఆకాశవాణిలో న్యూస్ రీడర్ గా ఏడిద గోపాలరావుకు 30 ఏళ్లగా పనిచేశారు. అంతేకాకుండా అక్కడ ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. సరస నవరస సంస్థను స్థాపించి ఢిల్లీలో, హైదరాబాద్ లో జాతీయ నాటకోత్సవాలు నిర్వహించారు. ఢిల్లీ వచ్చిన తెలుగు వారికి అయన మంచి ఆతిథ్యాన్ని ఇచ్చేవారు. నేతాజీ నాటకంలో గాంధీజీ వేషానికి పరిచయం చేయగా,గాంధీ ప్రధాన పాత్రగా బాపూ చెప్పిన మాట నాటికను డా విజయ భాస్కర్ తో వ్రాయించి దాదాపు 50 ప్రదర్శనలిచ్చారు .ఆయన సోదరుడు ప్రముఖ చిత్ర నిర్మాత ఏడిద నాగేశ్వరరావు. ఈయన కళాతపస్వీ కే. విశ్వనాధ్ తో ఎక్కువ సినిమాలు చేసారు.

Tags:    

Similar News