Fish Venkat Passes Away: టాలీవుడ్ నటుడు ఫిష్ వెంకట్ కన్నుమూత

Fish Venkat Passed Away: తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన ప్రముఖ హాస్యనటుడు, చిన్న విలన్ పాత్రలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఫిష్ వెంకట్ (వాస్తవిక పేరు వెంకట్ రాజ్) అనారోగ్యంతో మృతిచెందారు.

Update: 2025-07-18 20:14 GMT

Fish Venkat Passes Away: టాలీవుడ్ నటుడు ఫిష్ వెంకట్ కన్నుమూత

Fish Venkat Passed Away: తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన ప్రముఖ హాస్యనటుడు, చిన్న విలన్ పాత్రలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఫిష్ వెంకట్ (వాస్తవిక పేరు వెంకట్ రాజ్) అనారోగ్యంతో మృతిచెందారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఆయన తుదిశ్వాస విడిచారు. వయసు 53 సంవత్సరాలు.

గత కొంతకాలంగా రెండు కిడ్నీలు పనిచేయకపోవడంతో డయాలసిస్‌పై ఆధారపడుతున్న ఫిష్ వెంకట్ ఆరోగ్యం ఇటీవల మరింతగా విషమించడంతో వైద్యులు వెంటిలేటర్‌పై ఉంచారు. అయినప్పటికీ చికిత్స ఫలించలేదు. కిడ్నీ మార్పిడి అవసరం అని వైద్యులు సూచించగా, ఆపరేషన్‌కు సుమారు రూ. 50 లక్షల ఖర్చు అవుతుందని కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఆయన కుమార్తె స్రవంతి సహాయానికి పిలుపునిచ్చారు. అయితే తగిన దాత లభించకపోవడం దురదృష్టకరంగా నిలిచింది.

హైదరాబాద్‌లో జన్మించిన ఫిష్ వెంకట్, తెలంగాణ యాసలో చెప్పే డైలాగులు, ప్రత్యేకమైన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకుల మనసులు దోచుకున్నారు. ‘ఖుషి’ సినిమాతో తెలుగు సినీ రంగ ప్రవేశం చేసిన ఆయన, ఆది, అదుర్స్, గబ్బర్ సింగ్, డీజే టిల్లు, స్లమ్ డాగ్ హస్బెండ్, నరకాసుర, కాఫీ విత్ ఎ కిల్లర్ వంటి పలు చిత్రాల్లో హాస్య భరితమైన, అలాగే నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లో నటించారు.

ప్రస్తుతం ఆయన భార్య సువర్ణ మరియు కుమార్తె స్రవంతితో కలిసి హైదరాబాద్‌లో నివాసముంటున్నారు. వెంకట్ మృతి పట్ల తెలుగు చిత్రపరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తోంది. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు ఆయనకు సోషల్ మీడియా వేదికగా నివాళులర్పిస్తూ సంతాపం తెలియజేస్తున్నారు.

Tags:    

Similar News