Nayeem Diaries Movie: నయీం డైరీస్ చిత్ర విడుదలపై తెలంగాణ హై కోర్ట్ స్టే
Nayeem Diaries Movie: నయీం డైరీ చిత్రం పై తెలంగాణ హై కోర్ట్ స్టే విధించింది.
నయీం డైరీ చిత్ర విడుదలపై తెలంగాణ హై కోర్ట్ స్టే
Nayeem Diaries Movie: నయీం డైరీస్ చిత్రం పై తెలంగాణ హై కోర్ట్ స్టే విధించింది. గాయని బెల్లి లలిత వ్యక్తిత్వాన్ని కించపరిచే విధంగా చిత్రీకరణ జరిగిందని ఆమె కుమారుడు సూర్య ప్రకాష్ కోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో హైకోర్ట్ స్టే విధించింది. సినిమాలో బెల్లి లలిత పాత్ర లతకు, నయీంకు మధ్య లిప్ లాక్ సీన్ పెట్టడంపై సూర్యప్రకాష్ అభ్యంతరం వ్యక్తం చేశారు.
1999లో లలిత దారుణ హత్యకు గురైంది నయీం జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన సినిమా ఇవాల విడుదల కాగా, చిత్రంలో సన్నివేశాలపై లలిత కుటుంబ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. హైదరాబాద్ సంధ్య థియేటర్ దగ్గర పోస్టర్లు, హోర్డింగులు ధ్వంసం చేశారు. సినిమాపై కోర్టుకెక్కడంతో కోర్టు స్టే ఇచ్చింది.