OTT Controversy: ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్‌పై తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ కన్నెర్ర

OTT Controversy: ఓటీటీల్లో సినిమాల విడుదల ఆపేవరకూ థియేటర్లు తెరవబోమని ఎగ్జిబిటర్లు తేల్చి చెప్పారు.

Update: 2021-07-08 09:01 GMT

 OTT Controversy

OTT Controversy: కరోనా ధాటికి థియేటర్లు మూసివేశారు. వాటిని ఎప్పుడు తెరుస్తారో? రానున్న రోజుల్లో ఎలాంటి పరిస్థితులు ఉంటాయో తెలియదు. దీంతో ఇప్పటికే కోట్లు వెచ్చించి చిత్రాలను తెరకెక్కించిన పలువురు నిర్మాతలు వడ్డీలు కట్టుకోలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో ఓటీటీ వేదికగా చిత్రాలను విడుదల చేసేందుకు పలువురు నిర్మాతలు మొగ్గు చూపుతున్నారు. అయితే ఫ్యూచర్ థియేటర్లదే నిర్మాత ఎవరు కూడా ఓటీటీ బాట పట్టవద్దని తెలంగాణ స్టేట్‌ ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ రిక్వెస్ట్ చేస్తోంది.

కరోనా ఫస్ట్, సెకండ్ వేవ్ వల్ల సినీ పరిశ్రమ భారీ నష్టాలను చవిచూసింది. ఫస్ట్ వేవ్ తర్వాత కొన్ని నెలలు పర్వాలేదనించినా సెకెండ్ వేవ్‌తో మరింత కుదేలు అయ్యింది. ఈ ఏడాదిన్నర కాలంలో కొన్ని సినిమాలు థియేటర్‌లో రిలీజ్ అయ్యాయి. కానీ ప్రస్తుత పరిస్థితులు అందుకు అనుకూలంగా లేవు దీంతో వన్ అండ్ ఆఫ్ ఇయర్ నుంచి రిలీజ్ కోసం ఎదురు చూస్తున్న నిర్మాతలంతా ప్రత్యమ్నాయంగా ఓటిటి ప్లాట్ పామ్స్ వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే సినిమా హాళ్ళను కాపాడాలని తెలుగు సినిమా నిర్మాతలకు తెలంగాణ స్టేట్‌ ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ రిక్వెస్ట్ చేస్తోంది. అక్టోబర్‌ 30 వరకు నిర్మాతలందరూ కూడా తమ సినిమాలను ఓటీటీలకు అమ్మకండని విజ్ణప్తి చేస్తున్నారు. ఫ్యూచర్ థియేటర్లదేనని నిర్మాతలూ ఓటీటీ బాట పట్టోద్దని కోరుతున్నారు.

ఓటిటికి చిన్న నిర్మాతలు అమ్ముకున్నారంటే పర్లేదు పెద్ద వాళ్లు ఓటిటిలో రిలీజ్ చెయ్యాడన్ని తప్పుపడుతున్నారు. ఓటీటీకి సినిమాలు రిలీజ్ చెయ్యడం వల్ల డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్, కార్మికులు బాగా నష్టపోతారని వాపోతున్నారు. ధియేటర్ రిలీజ్ లేనందున ఓటిటి కంపెనీలు ప్యాన్సీ ఆఫర్స్ చేస్తున్నాయని. ఆ ఉచ్చులో పడుద్దోని సూచిస్తున్నారు.

సినిమాలు ఓటిటిలో రిలీజ్ చెయ్యడాన్ని ధియేటర్స్ యాజమాన్యాలు తప్పుపట్టడం లేదు కానీ ధియేటర్ లో రిలీజ్ చేశాకా వారానికో పదిరోజులకో ఓటిటిలో రిలీజ్ చేసుకుంటే బాగుంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. థియేటర్ వ్యవస్థను ఓటీటీలు కిల్ చేయడానికి చూస్తున్నాయని. వారి మాయంలో నిర్మాతలు పడొద్దని నిర్మాతలకు ఎగ్జిబిటర్స్ రిక్వెస్ట్ చేస్తున్నారు.

మొత్తంగా భారీ పెట్టుబడి పెట్టిన నిర్మాతలు ఎలాగోలా సొమ్ము చేసుకోవాలని ఓటీటీ వైపు మొగ్గుచూపాలని ప్రయత్నం చేస్తున్నా, హీరోల కోరిక మేరకు వెనక్కి తగ్గుతున్నట్లు కూడా వార్తలొస్తున్నాయి. అసలు థియేటర్లు ఎప్పుడు తెరుస్తారు, తెరిచినా మునుపటిలా జనం ఎగబడి చూస్తారా అనే సందేహాలు కూడా ఉన్నాయి. అందుకే ఎటూ పాలుపోక అవస్థలు పడుతున్నారు.

Tags:    

Similar News