Mirai Trailer: విజువల్ వండర్‌గా ‘మిరాయ్’ ట్రైలర్..!
Mirai Trailer: యువ నటుడు తేజ సజ్జా ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘మిరాయ్’ (Mirai) భారీ అంచనాల మధ్య రూపొందుతోంది.
Mirai Trailer: విజువల్ వండర్‌గా ‘మిరాయ్’ ట్రైలర్..!
Mirai Trailer: యువ నటుడు తేజ సజ్జా ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘మిరాయ్’ (Mirai) భారీ అంచనాల మధ్య రూపొందుతోంది. ఈ చిత్రంలో మంచు మనోజ్ ప్రతినాయక పాత్రలో మెప్పించనున్నారు. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రానికి కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్నారు.
తాజాగా విడుదలైన ట్రైలర్ (వ్యవధి: 2 నిమిషాలు 58 సెకన్లు) లో సినిమా గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ (VFX) ఉత్కంఠ రేపేలా ఉన్నాయి. ప్రత్యేకంగా డ్రాగన్‌తో హీరో పోరాటం విజువల్‌గా ఆకట్టుకుంటోంది. అలాగే, "దునియాలో ఏదీ నీది కాదు..." అనే డైలాగ్ ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేస్తోంది. ఈ ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్ మూవీ సెప్టెంబర్ 12న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కాబోతోంది.