ఆగని సినిమా టికెట్ల వార్.. తమ్మారెడ్డి భరద్వాజ సంచలన వ్యాఖ్యలు...
Tammareddy Bharadwaja: ఏపీ ఎమ్మెల్యే నల్లపు రెడ్డిపై సినీ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
ఆగని సినిమా టికెట్ల వార్.. తమ్మారెడ్డి భరద్వాజ సంచలన వ్యాఖ్యలు...
Tammareddy Bharadwaja: ఏపీ ఎమ్మెల్యే నల్లపు రెడ్డిపై సినీ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సినిమా వారికి బలిసిందనడం సరికాదని నిర్మాతల్లో మీ సామాజిక వర్గం వారే టాప్ అన్న సంగతి తెలుసుకోవాలని అన్నారు. తెలంగాణ ప్రభుత్వానికి రేట్లు పెంచే అవకాశముంటే ఏపీ ప్రభుత్వానికి రేట్లు తగ్గించే అవకాశం కూడా ఉందన్నారు. ప్రొడక్ట్ కు తగిన ధర నిర్ణయించుకునే అధికారం నిర్మాతలకు ఉంటుందన్నారు.
సినిమాల వాయిదాకు ఏపీలో టిక్కెట్ రేట్లు కారణం కాదని, కరోనా వల్లనే పాన్ ఇండియా సినిమాలు వాయిదా పడ్డాయనీ అన్నారు. సినిమాలో దమ్ముంటే ఆక్యుపెన్సీ పెద్ద మేటర్ కాదని, పుష్ప అదే విషయం ప్రూవ్ చేసిందనీ అన్నారు. ఇండస్ట్రీ వారికి సిగ్గు లేదు, దమ్ములేదు అనడం పైనా తమ్మారెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.