K. V. Anand Passes Away: ప్ర‌ముఖ తమిళ ద‌ర్శ‌కుడు కె.వి.ఆనంద్‌ గుండెపోటుతో మృతి

K. V. Anand passes away: ప్ర‌ముఖ తమిళ ద‌ర్శ‌కుడు కె.వి.ఆనంద్‌ (54) ఈ రోజు ఉదయం గుండెపోటుతో క‌న్నుమూశారు.

Update: 2021-04-30 03:20 GMT

Tamil Director KV Anand:(File Image)

K. V. Anand passes away: ప్ర‌ముఖ తమిళ ద‌ర్శ‌కుడు కె.వి.ఆనంద్‌ (54) శుక్ర‌వారం ఉదయం మూడు గంట‌ల‌కు గుండెపోటుతో క‌న్నుమూశారు. దీంతో తమిళ చిత్ర పరిశ్రమ లొ విషాదఛాయలు అలముకున్నాయి. కె.వి.ఆనంద్‌ జీవాతో రంగం, సూర్యతో బ్రదర్స్, వీడొక్కడే, లేటెస్ట్‌గా బందోబస్త్ వంటి విజయవంతమైన సినిమాలకు దర్శకత్వం వహించారు. అంతేకాదు ఆయన ప్రేమ‌దేశం, ఒకేఒక్క‌డు, ర‌జినీకాంత్ శివాజీ చిత్రాల‌కు సినిమాటోగ్రాఫ‌ర్‌గా కూడా ప‌నిచేశారు. మొదట్లో ఫోటో జర్నలిస్ట్ గా పనిచేసిన కె వి ఆనంద్ ఆ తర్వాత తమిళ సినిమా క‌ణా కండేన్ సినిమాతో ద‌ర్శ‌కుడిగా మారారు.

ఆయన దర్శకత్వం వహించిన మొదటి సినిమా పెద్దగా అలరించకపోయినా.. ఆ తర్వాత ఆయన సూర్‌తతో వీడొక్క‌డే(అయాన్‌)తో హిట్ కొట్టారు. ఇక ఆ తర్వాత ఆయన జీవాతో రంగం అనే సినిమా చేశారు. ఈ సినిమాతో అటు తమిళంతో పాటు తెలుగులోనూ సూప‌ర్ హిట్ అయ్యింది. ఆ త‌ర్వాత మరోసారి సూర్యతో ప్రయోగాత్మక చిత్రం బ్ర‌ద‌ర్స్‌(మాట్రాన్‌) అనే సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాలో సూర్య డబుల్ యాక్షన్ చేశారు. కాజల్ హీరోయిన్‌గా చేసింది. ఆ తర్వాత ధనుష్‌తె అనేకుడు చేశారు ఆనంద్. ఈ సినిమా కూడా మంచి పేరును తెచ్చింది.

ఇక ఆయన చివరగా మరోసారి సూర్యతో బందోబ‌స్త్‌ అనే సినిమాను చేశారు. మోహన్ లాల్ మరో ప్రధాన పాత్రలో కనిపించారు. కె.వి.ఆనంద్ అకాల మృతిపై తమిళ చిత్ర ప‌రిశ్ర‌మ దిగ్బ్రాంతిని వ్య‌క్తం చేసింది. కె. వి ఆనంద్ చెన్నైలో ఫ్రీ లాన్స్ ఫొటో జ‌ర్న‌లిస్ట్‌గా త‌న కెరీర్‌ను స్టార్ట్ చేశారు. ఆ తర్వాత క‌ల్కి, ఇండియా టుడే వంటి దిన ప‌త్రిక‌ల్లో ప‌నిచేశారు. ఆ త‌ర్వాత ద‌ర్శ‌కుడిగా మారారు. ఇటీవల కోలీవుడ్ కు చెందిన ప్రముఖ హాస్యనటుడు వివేక్ సైతం గుండె పోటుతో మృతి చెందిన విషయం తెలిసిందే. ఇద్దరు గొప్ప వ్యక్తులు వెంట వెంటనే మృతిచెందడంతో చిత్ర పరిశ్రమకు తీరని లోటు అని పలువురు సినీ ప్రముఖులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News