11th Hour Teaser: చక్రవ్యూహంలో చిక్కుకున్న తమన్నా.. 11th అవర్ టీజర్

11th Hour Teaser: 'చక్రవ్యూహంలో చిక్కుకున్నప్పుడు దారి వెతికితే దొరకదు.. క్రియేట్ చేయాల్సి వస్తుంది' అని డైలాగ్ '11త్ అవర్' నేపథ్యాన్ని తెలియజేస్తోంది.

Update: 2021-03-29 07:16 GMT

తామన్న 11th హౌర్  మూవీ 

11th Hour Teaser: ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా సూపర్ హిట్ సినిమాలు, వరుస షోలతో దుసూకుపోతున్న విషయం తెలిసిందే. కాక్ర్, నాంది, గాలిసంపత్ , జాంబిరెడ్డి వంటి సూపర్ హిట్ చిత్రాల డిజిటల్ రైట్స్ కొనుగోలు చేసి జోరు మీదవుంది. ఇటీవటే టాలీవుడ్ అగ్రకథానాయక సమంత‌తో సామ్ జామ్ షో ప్రసారం చేసిన సంగతి తెలిసిందే. ఆ షో విజయవంతం కావడంతో రానా హోస్ట్‌గా చేసిన నెంబర్ వన్ యారీ మూడో సిజన్ డిజిటల్ రైట్స్ కోనుగోలు చేసింది. తాజాగా ఆహా వెబ్ సిరీస్‌లో రూపొందించడంలో స్పీడ్ పెంచింది. ఆహా టీమ్ టాలీవుడ్ టాప్ హీరోయిన్ తమన్నా ప్రధాన పాత్రలో ఓ ప్రాజెక్ట్‌ను అధికారికంగా అనౌన్స్ చేసింది.

ఈ నేపథ్యంలో మిల్కీ బ్యూటీ తమన్నా ప్రధాన పాత్రలో ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వంలో రూపొందుతున్న వెబ్‌ సిరీస్‌ '11th అవర్‌'. థ్రిల్లర్‌ జోనర్‌లో తెరకెక్కుతున్న ఈ వెబ్‌ సిరీస్‌ ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించడంతో ఈ సిరీస్ ఆసక్తి నెలకొంది. ఇప్పుడు సిరీస్ సంబంధించిన ట్రైలర్ రిలీజ్ అయింది.

ఇక ట్రైలర్ విషయానికి వస్తే.. పురుషాధిక్యత ఉన్న రంగంలోకి దిగిన యువతి.. ఆ పోటీని శత్రువులను తట్టుకొని ఎలా పోరాడి నిలబడింది అనేది ఈ కథ. 'చక్రవ్యూహంలో చిక్కుకున్నప్పుడు దారి వెతికితే దొరకదు.. క్రియేట్ చేయాల్సి వస్తుంది' అని డైలాగ్ '11త్ అవర్' నేపథ్యాన్ని తెలియజేస్తోంది. తమన్నా ఈ సిరీస్ లో కార్పొరేట్ కంపెనీని ని నడిపే అరాత్రికా రెడ్డి అనే అమ్మాయిగా కనిపిస్తోంది. అయితే కుటుంబ సభ్యులు - స్నేహితులు - శత్రువులు ఆమె ఆ కంపెనీని నిర్వహించలేదనే భావనతో ఉన్నట్లు టీజర్ చూస్తే అర్థం అవుతోంది.

తమన్నా మొదటి సారి వెబ్ సిరీస్ లో నటించింది. ఏప్రిల్‌ 9వ తేదీ నుంచి ఆహాలో స్ట్రీమింగ్‌ కానుంది. థ్రిల్లర్‌ జోనర్‌ వెబ్ సిరీస్ లను ప్రేక్షకులు ఇష్టపడడంతో ఓటీటీ అన్ని ఆ మార్గంలో సిరీస్ ప్లాన్ చేస్తున్నాయి. ప్రదీప్ ఉప్పలపాటి ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు. అరుణ్ ఆదిత్ , వంశీ కృష్ణ , రోషిణి ప్రకాష్ , జయప్రకాష్ , శత్రు , మధుసూదన్ రావు , పవిత్ర లోకేష్, అనిరుధ్, బాలాజీ , శ్రీకాంత్ అయ్యంగార్, వినయ్ , ప్రియా బెనర్జీ తదితరులు ఇతర పాత్రలు పోషించారు.


Full View


Tags:    

Similar News