మద్యం అమ్మకాలపై రజినీ ఘాటు వ్యాఖ్యలు

మద్యం అమ్మకాలపై ప్రముఖ సినీ నటుడు రజనీకాంత్ తమిళనాడు ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు.

Update: 2020-05-10 12:20 GMT
Superstar Rajinikanth(File photo)

మద్యం అమ్మకాలపై ప్రముఖ సినీ నటుడు రజనీకాంత్ తమిళనాడు ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు.దేశంలో కరోనా వైరస్‌ విజృంభిస్తుంటే వైన్స్ షాపుల వద్ద కనీసం సామాజిక దూరం పాటించకుండా మందుబాబులు ఎగబడుతున్నారు. అయితే మద్యం అమ్మకాలపై తమిళ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ స్పందించారు. తమిళనాడులోని ఏఐఏడీఎంకే ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. కరోనా తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో మద్యం దుకాణాలు తిరిగి తెరిస్తే.. మీరు మళ్లీ అధికారంలోకి రావాలనే కలను మరచిపోవాలని రజనీ తన ట్విట్టర్‌ ఖాతాలో పేర్కొన్నాడు.

 తమిళనాడులో మద్యం దుకాణాలు మూసివేయాలని, డోర్ డెలివరీ అంశాన్ని పరిశీలించాలని ప్రభుత్వానికి మద్రాసు హైకోర్టు సూచించింది. డోర్ డెలివరీ సాధ్యం కాదని, ఆదాయం పడిపోతుందని, సుప్రీం కోర్టును ఆశ్రయించి స్టే తీసుకొచ్చింది. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య నానాటికీ పెరుగుతున్నా.. మద్యం అమ్మకాలను మాత్రం జోరుగా సాగుతున్నాయి. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య నానాటికీ పెరుగుతున్నా.. మద్యం అమ్మకాలను మాత్రం జోరుగా సాగుతున్నాయి. వైన్ షాపులు తెరిచిన తొలిరోజే 170 కోట్ల మధ్య విడిపోయిన విషయం తెలిసిందే.

Tags:    

Similar News