Superstar Krishna: వైరల్ గా మారిన కృష్ణ వీలునామా..
Superstar Krishna: లెజెండరీ నటుడు సూపర్ స్టార్ కృష్ణ మరణంతో టాలీవుడ్ చలనచిత్ర పరిశ్రమలో ఒక శకం ముగిసినట్టు అయ్యింది.
Superstar Krishna: వైరల్ గా మారిన కృష్ణ వీలునామా..
Superstar Krishna: లెజెండరీ నటుడు సూపర్ స్టార్ కృష్ణ మరణంతో టాలీవుడ్ చలనచిత్ర పరిశ్రమలో ఒక శకం ముగిసినట్టు అయ్యింది. సూపర్ స్టార్ కృష్ణ ఇక లేరు అనే చేదు నిజాన్ని ఇంకా ఎవరూ జీర్ణించుకోలేక పోతున్నారు. దాదాపు 350కు పైగా సినిమాలలో నటించి కోట్లాదిమంది అభిమానుల మనసు గెలుచుకున్న కృష్ణ ఈమధ్యనే గుండె పోటు కారణంగా తుది శ్వాస విడిచారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కృష్ణ కు ఛాతిలో నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు వెంటనే హైదరాబాద్ లోని కాంటినెంటల్ హాస్పిటల్ లో జాయిన్ చేశారు. కృష్ణ ప్రాణాలను కాపాడడానికి ప్రయత్నించామని కానీ తమ ట్రీట్మెంట్ కు కృష్ణ బాడీ సహకరించలేదని, వైద్యులు చెబుతున్నారు.
అయితే తాజాగా కృష్ణ కు సంబంధించిన ఓ వార్త ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. సూపర్ స్టార్ కృష్ణ అప్పట్లోనే ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకున్న హీరోగా రికార్డ్ బద్దలు కొట్టారు. చిరంజీవి కన్నా ఎక్కువ పారితోషకం తీసుకున్న కృష్ణ డబ్బుని ఆదా చేయలేదని కొందరు చెబుతుంటారు. సూపర్ స్టార్ కృష్ణ అన్నీ సవ్యంగా చూసుకుని ఉంటే వేలకోట్ల ఆస్తిని వెనకేసుకునేవాడు అని పుకార్లు కూడా ఉన్నాయి. తాజాగా ఆయన వీలునామాలో తన 400 కోట్ల ఆస్తిని తన మనవళ్లు, మనవరాలుకు సమానంగా పంచాలి అని రాసి పెట్టారని తెలుస్తోంది.