Peddanna Movie Review: రజినీకాంత్ "పెద్దన్న" సినిమా రివ్యూ

Update: 2021-11-04 10:37 GMT

Peddanna Movie Review: రజినీకాంత్ "పెద్దన్న" సినిమా రివ్యూ

Peddanna Movie Review: కబాలి, కాలా, దర్బార్ చిత్రాల తర్వాత సూపర్ హిట్ కోసం ఎదురుచూస్తున్న రజనీకాంత్ తాజాగా "పెద్దన్న" చిత్రంతో దీపావళి సందర్భంగా నవంబర్ 4న ప్రేక్షకుల ముందుకొచ్చాడు. గత చిత్రాలకు భిన్నంగా రజనీకాంత్ నటించిన "పెద్దన్న" చిత్రం పెద్దగా ప్రమోషన్ లేకుండానే సాదాసీదాగా విడుదలైంది.

చిత్రం: పెద్దన్న

నటీనటులు: రజనీకాంత్‌, నయనతార, కీర్తి సురేశ్‌, జగపతిబాబు, ప్రకాశ్‌ రాజ్‌, మీనా, ఖుష్బు తదితరులు

సంగీతం: డి. ఇమాన్‌

సినిమాటోగ్రఫీ: వెట్రీ

నిర్మాత:

దర్శకత్వం: శివ

బ్యానర్: సన్ పిక్చర్స్

విడుదల తేది: 04/11/2021

కథ:

తూర్పు గోదావరి జిల్లా రాజోలు గ్రామంలో అన్యాయాలు, అక్రమాలకు ఎదురు నిలిచే పెద్దన్న (రజినీకాంత్) నీతి, నిజాయితీ, న్యాయానికి ప్రతీక నిలుస్తాడు. (రజనీకాంత్‌)కు చెల్లి కనకమహాలక్ష్మీ అలియాస్‌ కనకమ్‌(కీర్తి సురేశ్‌) అంటే అమితమైన ప్రేమ. తన చెల్లెలు కంటతడి చూస్తే ఎంతకైనా తెగించే పెద్దన్నకు కనక మహాలక్ష్మీ పెద్ద షాక్ ఇస్తుంది. అన్నయ్య చూసిన పెళ్లి సంబంధం కాదని పెళ్లికి కొద్ది గంటల ముందు ప్రియుడితో కలకత్తాకు పారిపోవడంతో పెద్దన్న దిగ్బ్రాంతికి గురవుతాడు. కలకత్తాకు వెళ్లిన కనకమ్ పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోతుంది. చెల్లికి వచ్చిన సమస్యలను ఎలా తీర్చాడు? చివరకు ఈ అన్నా చెల్లెళ్లు ఎలా కలిశారు అనేదే "పెద్దన్న" కథ.

నటీనటులు:

సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ గ్రామపెద్ద వీరన్నగా తన స్టైల్‌, నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. తనదైన డైలాగ్స్‌, యాక్టింగ్‌తో సినిమా భారాన్ని మొత్తం తనపై వేసుకొని ముందుకు నడిపించాడు. వీరన్న చెల్లెలు కనకమహాలక్ష్మీ పాత్రలో కీర్తి సురేశ్‌ ఒదిగిపోయింది. ఎమోషనల్‌ సీన్స్‌లో ఆమె నటన అద్భుతం. ఇక లాయర్‌ పార్వతిగా నయనతార ఆమె పాత్రకు న్యాయం చేసింది. ప్రతినాయకుడి పాత్రలో జగపతిబాబు, అభిమన్యు సింగ్ లు ఆకట్టుకున్నారు. మీనా, ఖుష్బూలతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రలతో ఫర్వాలేదనిపించారు.

సాంకేతిక వర్గం:

వెట్రీ సినిమాటోగ్రఫితో ఆకట్టుకున్నాడు. కలకత్తాలో చిత్రీకరించిన కొన్ని ఎమోషనల్ సీన్లతో పాటు యాక్షన్ సన్నివేశాలను బాగా వెట్రీ చిత్రీకరించాడు. డి ఇమామ్ మ్యూజిక్ తో ఫర్వాలేదనిపించాడు. రెబెన్ ఎడిటింగ్‌ లో అంతగా పసలేదు. సినిమాలోని కొన్ని సన్నివేశాలు ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టె విధంగా ఉంటాయి. అవసరం ఉన్నదాని కంటే సినిమా నిడివి ఎక్కువగా ఉన్నట్లు అనిపిస్తుంది.

ప్లస్ పాయింట్స్:

  • రజినీకాంత్, నయనతార, కీర్తి సురేష్ నటన
  • వెట్రీ సినిమాటోగ్రఫి
  • బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్
  • యాక్షన్ సన్నివేశాలు

మైనస్ పాయింట్స్:

  • రొటీన్ కథ
  • ఎడిటింగ్
  • పాటలు
  • స్క్రీన్ ప్లే

బాటమ్ లైన్: పేరుకు పెద్దన్న కాని థియేటర్స్ లో ప్రేక్షకులు చిన్నబోయారు.

Tags:    

Similar News