Superstar Krishna: ప్రభుత్వ లాంఛనాలతో ముగిసిన కృష్ణ అంత్యక్రియలు..
Superstar Krishna: ప్రభుత్వ లాంఛనాలతో ముగిసిన కృష్ణ అంత్యక్రియలు..
Superstar Krishna: ప్రభుత్వ లాంఛనాలతో ముగిసిన కృష్ణ అంత్యక్రియలు..
Superstar Krishna: అభిమానుల కన్నీటి నివాళులు... ప్రముఖుల సంతాపం... కుటుంబ సభ్యుల అశ్రునయనాల మధ్య... తెలుగు ప్రజల అభిమాన హీరో, సూపర్ స్టార్ కృష్ణ అంత్యక్రియలు ముగిశాయి. ప్రభుత్వ లాంఛనాలతో సూపర్ స్టార్ కృష్ణకు జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో అంతిమ సంస్కారాలు నిర్వహించారు. పోలీసులు గాల్లో కాల్పులు జరిపి గౌరవవందనం సమర్పించారు. వేలాదిగా తరలివచ్చిన అభిమానులు కృష్ణ అమర్ రహే నినాదాలతో హోరెత్తించారు. కృష్ణ కుమారుడు మహేశ్ బాబు తండ్రి చితికి నిప్పంటించి దహన సంస్కారాలు నిర్వహించారు.
అంతకుముందు పద్మాలయా స్టూడియో నుంచి ప్రారంభమైన కృష్ణ అంతిమయాత్రలో అడుగడుగునా అభిమాన నీరాజనం పలికారు. ప్రభుత్వ లాంఛనాల నడుమ పోలీస్ బ్యాండ్ ముందు నడవగా అంతిమయాత్ర అశ్రునయానాల మధ్య సాగింది. భారమైన హృదయాలతో కృష్ణ అభిమానులు సూపర్ స్టార్‌ను సాగనంపారు. దారిపొడవునా పూలవర్షం కురిపిస్తూ అభిమానం చాటుకున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక ప్రాంతాల నుంచి అభిమానులు కృష్ణ అంతిమయాత్రలో పాల్గొన్నారు.