Sundarakanda Success: ‘సుందరకాండ’ సక్సెస్ టాక్!

నారా రోహిత్ హీరోగా రంగప్రవేశం చేసి దాదాపు 16 ఏళ్లు పూర్తవుతున్నా, ఆయనలో ఉత్సాహం మాత్రం ఏమాత్రం తగ్గలేదు. బాణం సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఆయన, సోలో సినిమాతో ఫ్యామిలీ ఆడియెన్స్‌కు చేరువయ్యారు.

Update: 2025-08-29 15:35 GMT

Sundarakanda Success: ‘సుందరకాండ’ సక్సెస్ టాక్!

నారా రోహిత్ హీరోగా రంగప్రవేశం చేసి దాదాపు 16 ఏళ్లు పూర్తవుతున్నా, ఆయనలో ఉత్సాహం మాత్రం ఏమాత్రం తగ్గలేదు. బాణం సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఆయన, సోలో సినిమాతో ఫ్యామిలీ ఆడియెన్స్‌కు చేరువయ్యారు. అప్పటి నుంచి మాస్‌, క్లాస్‌ అన్న తేడా లేకుండా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు. మధ్యలో కొంత విరామం తీసుకున్నా, ప్రతినిధి 2తో తిరిగి రీఎంట్రీ ఇచ్చి, భైరవం తర్వాత ఇప్పుడు సుందరకాండ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

వినాయక చవితి సందర్భంగా విడుదలైన ఈ చిత్రం, బోల్డ్ కాన్సెప్ట్‌తో పాటు ఫ్యామిలీ టచ్‌ను కలగలిపిన ప్రత్యేకమైన కథాంశంతో ఆకట్టుకుంది. దర్శకుడు వెంకటేష్ నిమ్మలపూడి కథనాన్ని చాలా కచ్చితంగా, కన్వీన్సింగ్‌గా నడిపించారు. రోహిత్ నటన సినిమాలో మరో మెట్టుకి తీసుకెళ్లేలా ఉందని చెప్పాలి. ఇది ఆయన కెరీర్‌లో పర్ఫెక్ట్ కంబ్యాక్‌గా భావిస్తున్నారు.

హీరోయిన్ శ్రీదేవికి ఈ సినిమా రీ ఎంట్రీగా, వృతి వాగానికి మాత్రం కొత్తగా మెప్పించే పాత్ర దొరికింది. సీనియర్‌ను ప్రేమించి దూరమైన వ్యక్తి, తరువాత అలాంటి లక్షణాలు కలిగిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని ఎదురు చూడటం, చివరికి ఊహించని మలుపుతో కథ సాగడం – ఈ సుందరకాండ ప్రత్యేకత.

ఇలాంటి సెన్సిబుల్ సినిమాలు చేయడానికి హీరోకి గట్స్ కావాలి. నారా రోహిత్ మాత్రం మరోసారి తన స్టైల్‌ ఏంటో నిరూపించుకున్నారు. ఫ్యామిలీ ఆడియెన్స్‌ను ఎంటర్టైన్ చేయడమే కాకుండా, భావోద్వేగాలను కలగలిపి మంచి అనుభూతినిచ్చేలా సుందరకాండ విజయం సాధించినట్టే.

Tags:    

Similar News