ఎస్ఎస్ఎంబీ29 కథ లీక్: ప్రపంచాన్ని మార్చే రహస్యానికి మహేష్ బాబు వేట.. రాజమౌళి మూవీపై హాలీవుడ్ ప్రభావం!

ఎస్ఎస్ఎంబీ29 మూవీ కథ లీక్ అయింది. మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్‌లో రూపొందుతున్న ఈ సినిమా ప్రపంచాన్ని మార్చగల రహస్యాన్ని వెతకడం చుట్టూ తిరుగుతుంది. టాంజానియాలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోంది. కథ, షూటింగ్ డీటెయిల్స్ ఇక్కడ చదవండి.

Update: 2025-07-18 06:47 GMT

SSMB29 Story Leak: Mahesh Babu’s Hunt for a World-Changing Secret – Rajamouli’s Film Inspired by Hollywood!

సూపర్ స్టార్ మహేష్ బాబు, డైరెక్టర్ రాజమౌళి కాంబినేషన్‌లో రూపొందుతున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం SSMB29 కథ లీకై హాట్ టాపిక్ అయింది. ఈ సినిమా స్టోరీ డీటెయిల్స్‌ను టాంజానియాకు చెందిన ఓ అంతర్జాతీయ మీడియా సంస్థ 'ది సిటిజన్' వెల్లడించింది. ఇందులో మహేష్ బాబు ప్రపంచాన్ని మార్చగల శక్తివంతమైన రహస్యాన్ని తెలుసుకోవడానికి సాగే అడ్వెంచరస్ జర్నీ చూపించనున్నారు.

టాంజానియాలో షూటింగ్ – భారీ బడ్జెట్‌తో ఎస్ఎస్ఎంబీ29

ఈ సినిమా షూటింగ్ జూలై మూడో వారం నుంచి టాంజానియాలోని సెరెంగెటిలో ప్రారంభం కానుంది. అనంతరం దక్షిణాఫ్రికా ప్రాంతాల్లో కూడా కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. ఈ మూవీకి ₹1000 కోట్ల భారీ బడ్జెట్ ఉండనుందని సమాచారం. ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటించనున్నారు.

ఎస్ఎస్ఎంబీ29 కథలో ఏముంది?

'ఇండియానా జోన్స్', 'ఆఫ్రికన్ అడ్వెంచర్' క్లాసిక్స్ నుంచి ప్రేరణ పొందిన ఈ కథలో మహేష్ బాబు ఓ రహస్య అన్వేషణలో నడుస్తారు. మారుమూల అడవుల్లో అతని ప్రయాణం సాగుతూ, అతను ఓ శక్తివంతమైన శత్రువు నుంచి ప్రపంచాన్ని కాపాడే రహస్యాన్ని తెలుసుకుంటాడు. పురాణాలు, ప్రకృతి దృశ్యాలు, థ్రిల్లింగ్ అడ్వెంచర్స్‌తో ఈ కథ నిండిపోనుందని తెలుస్తోంది.

రాజమౌళి మౌనం.. కానీ ఆసక్తి మోతాదు ఎక్కువే!

ఇప్పటివరకు రాజమౌళి ఈ ప్రాజెక్టుపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. జనవరిలో సైలెంట్‌గా పూజా కార్యక్రమం జరిపారు. గతంలో జపాన్‌లో ‘RRR’ ప్రమోషన్ సమయంలో మహేష్ గురించి మాట్లాడుతూ “అతను చాలా అందంగా ఉంటాడు, అతనిని ప్రేమించకుండా ఉండలేరు” అంటూ వ్యాఖ్యానించారు.

Tags:    

Similar News