ఆ ఒక్క విషయంలో సుకుమార్ ని మించలేకపోయిన రాజమౌళి..!

Sukumar Students: దసరా మూవీతో మరోసారి సుకుమార్ శిష్యులు దేశ ముదుర్లనిపించుకున్నారు.

Update: 2023-04-05 07:04 GMT

ఒకే విషయంలో సుకుమార్ ని మించలేకపోయిన రాజమౌళి

Sukumar Students: దసరా మూవీతో మరోసారి సుకుమార్ శిష్యులు దేశ ముదుర్లనిపించుకున్నారు. బ్లాక్ బస్టర్లు సొంతం చేసుకుంటున్నారు. ఈ విషయంలోనే సుకమార్ నిజంగా రాజమౌళినే దాటేశాడనంటున్నారు. రాజమౌళి పాన్ ఇండియా, పాన్ వరల్డ్ సినిమాలంటూ ట్రెండ్ సెట్ చేస్తున్నాడు కాని, తన శిష్యులు మాత్రం ఎక్కడ పెద్దగా సక్సెస్ అయినట్టుకనిపించట్లేదు. అదే సుకుమార్ అసిస్టెంట్లు మాత్రం దర్శకులుగా దుమ్ముదులిపేస్తున్నారు.

ఉప్పెనతో బుచ్చి బాబు వచ్చి రాగానే వందకోట్ల డైరెక్టర్ గా మారాడు. ఇప్పుడు ఏకంగా మెగా పవర్ స్టార్ తో సినిమా చేస్తున్నాడు. ఆల్ మోస్ట్ సుకుమార్ ప్రతీ శిష్యుడు ఇలానే రెచ్చిపోతున్నారు. దసరాతో శ్రీకాంత్ ఓదెలా ఎంత దుమ్ముదులుపుతున్నాడో తేలిపోయింది. బుచ్చిబాబు ప్రోగ్రెస్ తెలిసిందే. గతంతో కుమారి 21 ఎఫ్ , 18 పేజెస్ తో మరో సుక్కు శిష్యుడు సూర్యప్రతాప్ హిట్ మెట్టెక్కాడు.. ఇలా లెక్కల మాస్టార్ శిష్యులంతా దూసుకెళుతున్నారు.

రాజమౌళి శిష్యులు లైమ్ లైట్ లోకి రాకపోవటం, సుకుమార్ శిష్యులు దూసుకెళ్లటంతో ఈ విషయంలో జక్కన్న వెనక బడ్డాడంటున్నారు. ఇందులో మరో కోణం ఉంది. సుకుమార్ శిష్యులు హిట్లతో దూసుకెళుతున్నారు కాబట్టి, విరూపాక్ష తీసిన మరో శిష్యుడు హిట్ మెట్టెక్కితే సాయితేజ్ కి అలా కాలంకలిసొచ్చినట్టే అంటున్నారు. 

Tags:    

Similar News