శ్రీదేవి: అసలు సిసలు పాన్-ఇండియా హీరోయిన్

Sridevi Birth Anniversary: శ్రీదేవి అంటే వెరైటీ రోల్స్ కు కేరాఫ్ అడ్రస్. ఆమె చేయని పాత్ర అంటూ లేదని చెప్పవచ్చు. పదహారేళ్ళ వయసు, వసంత కోకిల, కార్తీక దీపం, జగదేకవీరుడు అతిలోక సుందరి వంటి ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో ఆమె నటించి మెప్పించారు.

Update: 2024-08-13 04:39 GMT

శ్రీదేవి: అసలు సిసలు పాన్-ఇండియా హీరోయిన్

Sridevi's Birth Anniversary: శ్రీదేవి… భారతీయ సినిమా చరిత్రలో మరిచిపోలేని అందాల తార. ఇండియన్ ఇండస్ట్రీలో హీరోలతో సమానంగా రెమ్యూనరేషన్ డిమాండ్ చేసిన టాప్ హీరోయిన్. కామెడీ, ఫ్యామిలీ సెంటిమెంట్, హారర్, యాక్షన్, హిస్టారికల్, మైథాలజీ… ఇలా అనేక జానర్స్ చిత్రాలలో నటించి మెప్పించిన ఏకైక నటి. అందానికే అందమైన నిర్వచనంగా వెండితెర అతిలోక సుందరిగా వెలిగిన శ్రీదేవి జీవితంలోని 10 ముఖ్యాంశాలివే.

శ్రీదేవి బాల నటిగా సినిమాల్లోకి వచ్చారు. నాలుగేళ్ళకే “కందన్ కరుణై” అనే తమిళ చిత్రంలో శ్రీదేవి తన నట జీవితం ప్రారంభించారు. ఆ సినిమా 1967లో విడుదలైంది. శ్రీదేవి అద్భుతమైన ప్రతిభ చూసి అందరూ ఆమెను చైల్డ్ ప్రాడిగీ అని పొగిడేవారు.

తెలుగులో ఆమె తొలి చిత్రం 1972లో వచ్చిన బడి పంతులు. హీరోయిన్ గా ఆమె నటించిన తొలి తెలుగు చిత్రం పదహారేళ్ళ వయసు. కె. రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్టయింది.

భారతీయ సినిమా రంగంలో తొలి ఫీమేల్ సూపర్ స్టార్ గా గుర్తింపు పొందిన నటి శ్రీదేవి.1980 – 1990 మధ్య కాలంలో ఆమె నటించిన సినిమాలు దాదాపు అన్నీ సూపర్ హిట్సే.

శ్రీదేవి తెలుగు అమ్మాయే. కానీ, తమిళనాడులో పుట్టి పెరిగారు. ఆమెకు తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషలు వచ్చు. ఏ భాషలో నటించినా ఆమె స్వయంగా డబ్బింగ్ చెప్పుకునేవారు. భారతదేశమంతటా ఆమెకు ఫ్యాన్ ఫోలోయింగ్ ఉండేది. ఆమె తొలి ఫీమేల్ సూపర్ స్టార్ మాత్రమే కాదు. తొలి పాన్ ఇండియా స్టార్ కూడా.

శ్రీదేవి అంటే వెరైటీ రోల్స్ కు కేరాఫ్ అడ్రస్. ఆమె చేయని పాత్ర అంటూ లేదని చెప్పవచ్చు. పదహారేళ్ళ వయసు, వసంత కోకిల, కార్తీక దీపం, జగదేకవీరుడు అతిలోక సుందరి వంటి ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో ఆమె నటించి మెప్పించారు. చిరంజీవితో కలిసి ఆమె నటించిన జగదేవకవీరుడు-అతిలోక సుందరి చిత్రం తెలుగు సినిమా పరిశ్రమలో ఒక క్లాసిక్ గా నిలిచిపోయింది.

ఎన్టీఆర్, ఏఎన్నార్ లతో నటించిన శ్రీదేవి వాళ్ళ వారసుల సరసన కూడా నటించి కొత్త జనరేషన్ కు కూడా ఫేవరెట్ హీరోయిన్ గా కొనసాగారు.

బోనీ కపూర్ ను పెళ్ళి చేసుకుని సినిమా రంగానికి 15 ఏళ్ళు దూరంగా ఉన్నారు. మళ్ళీ 2012లో ఇంగ్లిష్ వింగ్లిష్ చిత్రం ద్వారా కమ్-బ్యాక్ ప్రజెన్స్ ఇచ్చారు. ఆమె ప్రతిభ ఎంత చెక్కు చెదరకుండా ఉందో ఆ సినిమా ప్రూవ్ చేసింది.

శ్రీదేవికి భారతదేశ నాలుగవ అత్యున్నత పురస్కారం పద్మశ్రీ 2013లో లభించింది. సినిమా రంగానికి ఆమె అందించిన సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం ఆమెను పద్మశ్రీ అవార్డుతో గౌరవించింది.

వెండి తెర మీద దుమ్ము రేపే నటిగానే కాకుండా దాదాపు మూడు దశాబ్లాల పాటు శ్రీదేవి భారతదేశంలో ఒక ఫ్యాషన్ ఐకాన్ గా కొనసాగారు. సినిమాల్లో, బయటా ఆమె వేసుకునే దుస్తులు ట్రెండింగ్ ఫ్యాషన్ గా మారేవి. ఆమె మాడలింగ్ రంగం మీద కూడా తనదైన ముద్ర వేశారు.

శ్రీదేవి పేరు వింటే భారత సినిమా రంగంలో రికార్డు సృష్టించిన డాన్స్ నంబర్స్ గుర్తుకు వస్తాయి. సూపర్ హిట్ మిస్టర్ ఇండియా చిత్రంలో హవా హవాయి… పాట కల్ట్ హిట్ గా నిలిచిపోయింది. చాందినీ సినిమాలో ఆమె నటించిన.. మేరే హాతోంమే నౌ నౌ చూడియా హై… పాట ఇప్పటికీ ఉత్తరాదిన ఏ ఫంక్షన్ జరిగినా మారుమోగుతూ ఉంటుంది. తెలుగులో అబ్బ నీ తీయనీ దెబ్బ… ఈనాటికీ ట్రెండింగ్ సాంగ్.

శ్రీదేవి కామిక్ టైమింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇప్పటికీ, ఆమె అల్లరి పాత్రతో సూపర్ హిట్ అయిన మిస్టర్ ఇండియా చిత్రంలో ఇప్పటికీ ఇంటర్నెట్ లో జనం చూస్తునే ఉన్నారంటే కారణం.. శ్రీదేవి చూపించిన అద్భుతమైన కామిక్ టైమింగే.

శ్రీదేవికి నటనతో పాటు పెయింటింగ్ అంటే చాలా ఇష్టమని చాలా మందికి తెలియదు. ఆమె మంచి పెయింటర్ కూడా. ఆమె పెయింటింగ్స్ ను అంతర్జాతీయ ఆర్ట్ షోలలో ప్రదర్శించారు.

శ్రీదేవి చాలా కాలం భారతదేశంలోనే టాప్-పెయిడ్ హీరోయిన్ గా కొనసాగారు. 80ల నుంచి 90ల వరకూ ఆమెకు హీరోలతో సమానంగా రెమ్యునరేషన్ ఇవ్వడానికి ప్రొడ్యూసర్లు రెడీగా ఉండేవారు. శ్రీదేవి పేరు మీదే సినిమా హిట్టయ్యేది అంటే ఆమె స్టార్ పవర్ ఏ స్థాయిలో ఉండేదో అర్థం చేసుకోవచ్చు.

ఈ అద్భుతమైన నటి 2018లో దుబాయిలో మరణించారు. ఆమె ఆకస్మిక మరణం భారతదేశాన్ని షాక్ కు గురి చేసింది. 54 ఏళ్ళ వయసులో ఆమె అనుమానాస్పద మరణంపై మీడియాలో రకరకాల కథనాలు వచ్చాయి. ఆమె లేని లోటు భారత సినిమా రంగంలో ఎప్పటికీ ఉంటుందని ఎంతో మంది అన్నారు. ఇప్పటికీ శ్రీదేవి పేరు చెబితే నిన్నటి తరానికే కాదు, నేటి తరానికీ ఒక గ్లామర్ వేవ్ చుట్టుముట్టిన ఫీలింగ్ కలుగుతుంది. దటీజ్ శ్రీదవి.

Tags:    

Similar News