Sreeleela: బాలీవుడ్‌లో మరో ఛాన్స్ కొట్టేసిన శ్రీలీల
శ్రీలీల తన అందం, అభినయంతో సినీ ప్రియులను అలరిస్తున్నారు. కొత్త తరహా కథలను ఎంచుకుంటూ ముందు వెళ్తున్నారు. పుష్ప2లో ఐటెం సాంగ్ కిస్సిక్‌తో ఉత్తరాది యువతరంలో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నారు.
బాలీవుడ్‌లో మరో ఛాన్స్ కొట్టేసిన శ్రీలీల
Sreeleela: శ్రీలీల తన అందం, అభినయంతో సినీ ప్రియులను అలరిస్తున్నారు. కొత్త తరహా కథలను ఎంచుకుంటూ ముందు వెళ్తున్నారు. పుష్ప2లో ఐటెం సాంగ్ కిస్సిక్‌తో ఉత్తరాది యువతరంలో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. దీంతో బాలీవుడ్‌లో వరుస ఛాన్స్‌లు కొట్టేస్తున్నారు. ఇప్పటికే యువ హీరో ఇబ్రహీం అలీఖాన్ సరసన ఓ చిత్రంలో నటిస్తున్నారు శ్రీలీల. అయితే తాజాగా మరో బంపరాఫర్ ఆమెను వరించిందంటూ టాక్ వినిపిస్తోంది.
ప్రస్తుతం శ్రీలీల తెలుగులో అగ్రతారల సరసన నటిస్తూ బిజీగా ఉన్నారు. అదే సమయంలో పుష్ప2 సినిమాలో ఐటెం సాంగ్‌తో నటించి అందరినీ మెప్పించారు. ఇప్పుడు ఆ ఐటెం సాంగే తన జీవితాన్ని మార్చేసింది. వరుస అవకాశాలు వచ్చేలా చేస్తోంది. ఇండస్ట్రీకి వచ్చిన కొద్ది కాలంలోనే అగ్రతారల సరసన నటించి స్టార్ హీరోయిన్‌లకు గట్టి పోటీగా నిలిచారు శ్రీలీల. ఇప్పుడు ఇటు టాలీవుడ్, అటు బాలీవుడ్‌లోనూ వరుస ఆఫర్లతో దూసుకుపోతున్నారు.
తాజాగా శ్రీలీల బాలీవుడ్‌లో భారీ ఆఫర్ దక్కించుకున్నారు. అగ్ర హీరో కార్తిక్ ఆర్యన్ సరసన హీరోయిన్‌గా నటించే ఛాన్స్ కొట్టేశారు. ఈ సినిమాకు అనురాగ్‌బసు దర్శకత్వం వహించనున్నారు. అయితే మొదట త్రిప్తి డిమ్రీని హీరోయిన్‌గా ఎంపిక చేయగా.. చివరి నిమిషంలో ఆమెను తప్పించి శ్రీలీలను ఖరారు చేసినట్టు తెలుస్తోంది. మార్చిలో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.
ఇదిలా ఉంటే పెళ్లి సందడి మూవీతో వెండితెరకు పరియమయ్యారు శ్రీలీల. ఈ మూవీలో గ్లామర్‌తో ఆకట్టుకున్నారు. వరుస ఆఫర్స్ క్యూ కట్టడంతో ఫుల్ బిజీ అయిపోయారు. అంతేకాదు టాలీవుడ్‌లో అడుగు పెట్టి చాలా తక్కువ రోజుల్లోనే స్టార్ స్టేటస్ అందుకున్నారు. తన గ్లామర్, డ్యాన్స్‌తో ఫ్యాన్స్‌ను ఫిదా చేస్తూ ముందుకెళ్తున్నారు.