Sravanthi Ravi Kishore: స్రవంతి రవి కిషోర్ సినిమాకు అరుదైన గౌరవం..
Sravanthi Ravi Kishore: ప్రముఖ టాలీవుడ్ నిర్మాత స్రవంతి రవి కిషోర్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
Sravanthi Ravi Kishore: స్రవంతి రవి కిషోర్ సినిమాకు అరుదైన గౌరవం..
Sravanthi Ravi Kishore: ప్రముఖ టాలీవుడ్ నిర్మాత స్రవంతి రవి కిషోర్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టాలీవుడ్ లో ఎన్నో సినిమాలను నిర్మించి ఎంతో మంది స్టార్ హీరోలతో సినిమాలు చేసిన స్రవంతి రవి కిషోర్ తనకంటూ ఇండస్ట్రీలో ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ఇండస్ట్రీలో హీరోగా అడుగుపెట్టినప్పటి నుంచి నిర్మాణపరంగా స్రవంతి రవి కిషోర్ చాలా సెలెక్టివ్ గా కరియర్ లో ముందుకు వెళుతున్నారు.
దాదాపు రామ్ సినిమాలను మాత్రమే నిర్మిస్తూ బయట హీరోలతో సినిమాలు చేయటం చాలా వరకు తగ్గించేశారు. తాజాగా ఇప్పుడు స్రవంతి రవి కిషోర్ బాలీవుడ్ లో కూడా ఒక సినిమాని నిర్మించారు అనే వార్త చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్రవంతి రవి కిషోర్ నిర్మించిన "కిడా" అనే తమిళ సినిమా ఈ మధ్యనే గోవాలో జరుగుతున్న అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్ లో ఇండియన్ పనోరమా విభాగంలో ప్రదర్శింపబడింది. ఈ చిత్రానికి స్టాండింగ్ ఒవేషన్ లభించింది. తాత మనవడు ఒక మేక చుట్టూ తిరిగే ఈ కథను డైరెక్టర్ ఆర్ ఏ వెంకట్ తెరకెక్కించారు.
ఈ సినిమా గురించి మాట్లాడుతూ, "చెన్నై వెళ్లినప్పుడు ఒక స్నేహితుడిని కలిశాను. తనకి ఒక కథ చెప్పాను. అది నచ్చి దర్శకుడికి కబురు పెట్టాడు. అతను ఈ సినిమా కథని తెరకెక్కించాలనుకునే విధానం నచ్చడంతో వెంటనే ఓకే చెప్పేసాను," అని ఈ సినిమా వెనుక బ్యాక్ స్టోరీ ని చెప్పారు స్రవంతి రవి కిషోర్. తొలి సినిమా అయినప్పటికీ బాగా తీయగలడు అనే నమ్మకంతో పూర్తి స్వేచ్ఛనిచ్చానని చెప్పారు రవి కిషోర్. ఇక త్వరలోనే ఈ సినిమాని తెలుగులో కూడా విడుదల చేస్తామని అన్నారు.