Sobhita Naga Chaitanya: వేడుకగా నాగచైతన్య, శోభిత హల్దీ వేడుక
Sobhita Naga Chaitanya: నాగ చైతన్య, నటి శోభితా ధూళిపాళ్ల హల్దీ వేడుక సంప్రదాయబద్దంగా జరిగింది.
Sobhita Naga Chaitanya: వేడుకగా నాగచైతన్య, శోభిత హల్దీ వేడుక
Sobhita Naga Chaitanya: నాగ చైతన్య, నటి శోభితా ధూళిపాళ్ల హల్దీ వేడుక సంప్రదాయబద్దంగా జరిగింది. ఈ ఏడాది డిసెంబర్ 4న వీరిద్దరి వివాహం జరగనుంది. ఈ క్రమంలోనే హల్దీ వేడుకను నిర్వహించారు. కుటుంబసభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే ఈ వేడుకలో పాల్గొన్నారు. కాబోయే దంపతులకు మంగళస్నానాలు చేయించి అభినందించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
నాగ చైతన్య, శోభిత జంట నిశ్చితార్థం ఇటీవల జరిగింది. సమంతో విడాకులు తీసుకున్న తర్వాత శోభితను నాగచైతన్య వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అన్నపూర్ణ స్టూడియోలో నాగచైతన్య, శోభిత పెళ్లి నిర్వహించనున్నారు. ఈ పెళ్లికి అతికొద్ది మంది సన్నిహితులకు మాత్రమే నాగార్జున కుటుంబం ఆహ్వానం పంపనుందని సమాచారం. అన్నపూర్ణ స్టూడియోస్ లోని నాగేశ్వరరావు విగ్రహం ఎదురుగా పెళ్లి చేసుకోవాలని నాగచైతన్య భావిస్తున్నారు. నాగేశ్వరరావు ఆశీస్సులు ఉండాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
మరో వైపు నాగచైతన్య సోదరులు అఖిల్ ఎంగేజ్ మెంట్ రవ్జీతో ఇటీవల నిశ్చితార్థం జరిగింది. ఈ విషయాన్ని ఎక్స్ లో నాగార్జున ప్రకటించారు. ఈ వేడకలో రెండు కుటుంబాలకు చెందిన కుటుంబ సభ్యులు, అతి కొంది మంది సన్నిహితులు మాత్రమే పాల్గొన్నారు. త్వరలోనే అఖిల్ పెళ్లి కూడా జరగనుంది.