Sivakartikeyan: కాలేజీ డేస్‌లో ఓ అమ్మాయిని ప్రేమించా.. ఫస్ట్ లవ్ గురించి చెప్పేసిన శివకార్తీకేయన్.

ప్రతి ఒక్కరికి లవ్ స్టోరీ ఉంటుంది. అయితే కొందరు ప్రేమించిన వారిని పెళ్లి చేసుకుని ప్రేమలో సక్సెస్ అయితే మరికొందరు విఫలం అవుతుంటారు.

Update: 2025-02-13 11:33 GMT

కాలేజీ డేస్‌లో ఓ అమ్మాయిని ప్రేమించా.. ఫస్ట్ లవ్ గురించి చెప్పేసిన శివకార్తీకేయన్.

Sivakartikeyan: ప్రతి ఒక్కరికి లవ్ స్టోరీ ఉంటుంది. అయితే కొందరు ప్రేమించిన వారిని పెళ్లి చేసుకుని ప్రేమలో సక్సెస్ అయితే మరికొందరు విఫలం అవుతుంటారు. సక్సెస్ అయినా కాకపోయిన ఫస్ట్ లవ్ ఓ మధుర జ్ఞాపకంగా ఉంటుంది. మొదట ప్రేమించిన అమ్మాయి, అబ్బాయిని మర్చిపోవడం అంత ఈజీ కాదు. అయితే తాను మొదట ప్రేమలో విఫలమయ్యానని చెప్పారు శివకార్తికేయన్. అంతేకాదు అందులోని ట్విస్టులు కూడా చెప్పుకొచ్చారు.

ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చిన శివకార్తీకేయన్ పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగారు. రీసెంట్‌గా అమరన్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శివకార్తీకేయన్ తన ఫస్ట్ లవ్ స్టోరీ గురించి చెప్పారు. కాలేజీ డేస్‌లో ఓ అమ్మాయిని ప్రేమించానని అన్నారు. కానీ అది వన్ సైడ్ లవ్ కావడంతో ఆమెను కలవలేదన్నారు. దూరంగా చూస్తూనే ప్రేమించానన్నారు. ఓ సారి తాను తన ప్రియుడితో కలిసి వెళ్లడం చూశానని అప్పటి నుంచి ఆమెను చూడలేదన్నారు. అలా తన ప్రేమ చెప్పకుండానే విఫలమైందన్నారు.

తర్వాత విజయ్ టీవీలో పనిచేస్తున్నప్పుడు ఆ అమ్మాయిని ఒక షాపింగ్ మాల్‌‌లో మళ్లీ చూశానని శివకార్తీకేయన్ చెప్పారు. అప్పటికే ఆమెకు పెళ్లి అయిందన్నారు. అయితే ఆమె పెళ్లి చేసుకుంది ముందు ప్రేమించిన వ్యక్తిని కాదు.. వేరే అమ్మాయితో పెళ్లి జరిగిందని అన్నారు. అది చూసి మనకు దొరకని అమ్మాయి అతనికి కూడా దొరకలేదని సంతోషించానని శివకార్తీకేయన్ తన ఫెయిల్యూర్ లవ్ స్టోరీ గురించి చెప్పుకొచ్చారు. శివకార్తీకేయన్ సినిమాల్లోకి రాకముందే వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. 2010లో ఆర్తిని ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కూతురు, ఒక కుమారుడు ఉన్నారు.

శివకార్తీకేయన్ విజయ్ టీవీలో వ్యాఖ్యాతగా పనిచేశారు. దర్శకుడు పాండియరాజన్ చిత్రం మెరీనాతో తమిళంలో హీరోగా పరిచయమయ్యారు. అతను నటించిన రెమో చిత్రం తెలుగులో మంచి విజయాన్ని సాధించింది. చిన్న తెర నుంచి సినిమాల్లోకి వచ్చిన శివకార్తీకేయన్ ఇప్పుడు టాప్ హీరోగా వెలుగొందుతున్నారు. అమరన్ విజయం తర్వాత శివకార్తీకేయన్ రెండు భారీ సినిమాల్లో నటిస్తున్నారు. వీటిలో ఒక సినిమాకు ఎ.ఆర్.మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా టైటిల్ ఫిబ్రవరి 17న శివకార్తికేయన్ పుట్టినరోజున విడుదల కానుంది. ఈ సినిమాలో శివకార్తికేయన్ సరసన రుక్మిణి వసంత నటిస్తున్నారు. అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు.

మరొకటి పరాశక్తి. ఈ మూవీకి సుధా కొంగర దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో శివకార్తికేయన్ తో పాటు శ్రీలీల, అథర్వ, రవి మోహన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. జివి ప్రకాష్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను డాన్ పిక్చర్స్ పతాకంపై ఆకాష్ భాస్కరన్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది.

Tags:    

Similar News