Krishna Death: సితార ఎమోషనల్ పోస్ట్.. ఇకపై అలాంటివి ఉండవంటూ ఆవేదన..
Sitara Ghattamaneni: సూపర్‌స్టార్ కృష్ణ మరణంతో ఘట్టమనేని కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.
Krishna Death: సితార ఎమోషనల్ పోస్ట్.. ఇకపై అలాంటివి ఉండవంటూ ఆవేదన..
Sitara Ghattamaneni: సూపర్‌స్టార్ కృష్ణ మరణంతో ఘట్టమనేని కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. కృష్ణ మరణంతో ఆయన తనయుడు మహేష్ బాబు కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇక మహేష్ కుమారుడు గౌతమ్, కూతురు సితార.. తమ తాత ఇక లేరనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. తాజాగా తన తాతయ్యను తలచుకుంటూ ఎమోషనల్ కామెంట్స్ చేసింది సితార.
కృష్ణతో దిగిన ఓ ఫొటోను షేర్ చేసిన ఆమె.. ''ఇకపై వారాంతపు భోజనాలు ఇంతకు ముందులా ఉండవు. మీరు నాకెన్నో విలువైన విషయాలు నేర్పించారు. నన్నెప్పుడూ నవ్వించేవారు. ఇప్పటి నుంచి అవన్నీ మీ జ్ఞాపకాలుగా నాకు గుర్తుండిపోతాయి. తాత గారు.. మీరు నా హీరో. ఏదో ఒక రోజు మీరు గర్వపడే స్థాయికి నేను చేరుకుంటా. మిమ్మల్ని బాగా మిస్ అవుతున్నా'' అని పేర్కొంది.