Actress Ankitha: వామ్మో.. సింహాద్రి హీరోయిన్‌ ఇలా మారిందా? ఇప్పుడేం చేస్తోందంటే..

Update: 2024-12-13 13:58 GMT

Simhadri Actress Ankitha latest photos goes viral: 2002లో వచ్చిన 'లాహిరి లాహిరి లాహిరిలో' మూవీ ద్వారా సినీ ప్రేక్షకులకు పరిచయమైంది అందాల తార అంకిత. ఆ తర్వాత ధనలక్ష్మి, ఐ లవ్‌ యూ వంటి సినిమాల ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకుంది. 2023లో వచ్చిన సింహాద్రి మూవీతో ఒక్కసారిగా ఫేమ్‌ అయిందీ చిన్నది. ఈ సినిమాలో సెకండ్‌ హీరోయిన్‌గా కనిపించిన అంకిత మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఈ సినిమా తర్వాత తెలుగుతో పాటు తమిళంలో కూడా పలు వరుస అవకాశాలను దక్కించుకుంది.

ఇలా 2009 వరకు వరుస సినిమాల్లో నటిస్తూ మెప్పిస్తూ వచ్చింది. అయితే ఆ తర్వాత ఒక్కసారిగా సినిమాలకు దూరమైంది. 2009లో వచ్చిన 'పోలీస్‌ అధికారి' అనే సినిమా తర్వాత అంకిత మళ్లీ మరో మూవీలో కనిపించలేదు. బాలనటిగా ఇండస్ట్రీకి పరిచయమైన అంకిత ఆ తర్వాత పలు ప్రకటనల్లో నటించింది. అనంతరం లాహిరి లాహిరి లాహిరి సినిమాతో హీరోయిన్ అయింది. పూర్తిగా సినిమాలకు దూరమైన తరువాత అంకిత పుణెకు చెందిన విశాల్‌ అనే వ్యాపారవేత్తను వివాహం చేసుకుంది.


ఆ తర్వాత అమెరికాలో స్థిరపడినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అంకిత తన తండ్రికి సంబంధించిన వజ్రాల వ్యాపారాన్ని చూసుకుంటూ మరో వైపు ఫ్యామిలీతో సమయాన్ని గడుపుతోంది. అయితే సినిమాలకు దూరమైనా సోషల్‌ మీడియా ద్వారా మాంత్రం అంకిత అభిమానులకు దగ్గరగానే ఉంటోంది. ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా తన లేటెస్ట్ ఫొటోలతో పాటు వ్యక్తిగత వివరాలను అభిమానులతో పంచుకుంటోంది. అలాగే అమెరికాలో జరిగే పలు ఈవెంట్స్‌లో పాల్గొంటూ ఆ వివరాలను సోషల్‌ మీడియా వేదికగా షేర్‌ చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ బ్యూటీ పోస్ట్ చేసిన కొన్ని ఫొటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి.

Tags:    

Similar News