Shruti Haasan: బిగ్ బాస్ హోస్ట్ గా శృతిహాసన్
Shruti Haasan: తెలుగులో లాగానే తమిళ్లో కూడా బిగ్ బాస్ సీజన్ 5 నడుస్తోంది.
Shruti Haasan: బిగ్ బాస్ హోస్ట్ గా శృతిహాసన్
Shruti Haasan: తెలుగులో లాగానే తమిళ్లో కూడా బిగ్ బాస్ సీజన్ 5 నడుస్తోంది. ఫస్ట్ సీజన్ నుంచి కమల్ హాసన్ హోస్ట్ గా వ్యవహరిస్తూ వస్తున్నారు. అయితే ఈ మధ్యనే అమెరికా పర్యటన కి వెళ్లి వచ్చిన కమల్ హాసన్ ఇప్పుడు కరోనా బారిన పడ్డారు. కమల్ హాసన్ ప్రస్తుతం ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కాబట్టి ఆయన మరొక రెండు వారాలపాటు బిగ్ బాస్ కీ రాలేరు. దీంతో కమల్ హాసన్ కి బదులు ఒక సెలబ్రిటీ గెస్ట్ ని ఆ రెండు వారాలకి హోస్ట్ గా వ్యవహరించడానికి పిలవాలని దర్శక నిర్మాతలు నిర్ణయించుకున్నారు.
తెలుగులో కూడా నాగార్జున షూటింగ్ పనుల వల్ల వేరే చోటికి వెళ్ళినప్పుడు నాగార్జున బదులు ఒకసారి రమ్యకృష్ణ మరొకసారి సమంత లు హోస్టులు గా వ్యవహరించారు. అప్పుడు టిఆర్పి లు కూడా బాగానే పెరిగాయి. అయితే తాజాగా కమల్ హాసన్ బదులుగా ఇప్పుడు శృతిహాసన్ ని రంగంలోకి దింపాలని దర్శక నిర్మాతలు ప్రయత్నించారు. శృతిహాసన్ కూడా ఓకే అన్నట్లు తెలుస్తోంది. అయితే దీని గురించిన అధికారిక ప్రకటన మాత్రం ఇంకా వెలువడాల్సి ఉంది.