శృతిహాసన్ ను కమెడియన్ చేసేసారుగా?
* రెండు సినిమాలలో కామెడీ చేయనున్న శృతిహాసన్
శృతిహాసన్ ను కమెడియన్ చేసేసారుగా?
Shruti Haasan: ఈ మధ్యనే "క్రాక్" సినిమాతో సూపర్ హిట్ అందుకున్న శృతిహాసన్ తాజాగా ఇప్పుడు సంక్రాంతి సందర్భంగా విడుదల కాబోతున్న రెండు పెద్ద సినిమాలలోనూ హీరోయిన్ గానే నటిస్తోంది. మెగాస్టార్ చిరంజీవి సరసన కేఎస్ రవీంద్ర అలియాస్ బాబీ దర్శకత్వంలో "వాల్తేరు వీరయ్య" సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న శృతిహాసన్ నందమూరి బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కనున్న "వీర సింహా రెడ్డి" సినిమాలో కూడా హీరోయిన్ గా నటించింది.
ఈ రెండు సినిమాలలోను మాస్ పాటలలో శృతిహాసన్ డాన్స్ అదిరిపోతుందని ఇప్పటికే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలలో శృతిహాసన్ పాత్ర విభిన్నంగా ఉండబోతుందని, ఈ రెండు సినిమాలలోనూ శృతిహాసన్ కామెడీ కూడా పండించబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి. "వాల్తేరు వీరయ్య" సినిమాలో ఒక సరదా ఫైట్ సీన్ ఉంటుందట. రామ్ లక్ష్మణ్ మాస్టర్ కంపోజ్ చేసిన ఈ ఫైట్ లో చిరంజీవి ఎప్పటిలాగానే తన కామెడీ టైమింగ్ తో నవ్విస్తారని తెలుస్తోంది. అయితే ఈ సన్నివేశంలో శృతిహాసన్ కూడా చిరుతో పాటు ప్రేక్షకులలో నవ్వుల పువ్వులు పూయించనుందట. మరోవైపు బాలకృష్ణ "వీర సింహా రెడ్డి" సినిమాలో కూడా శృతిహాసన్ తన పాత్రలో కామెడీ చేయబోతుందని తెలుస్తోంది.
కమల్ హాసన్ కామెడీ యాంగిల్ ఎలా ఉంటుందో అందరికీ తెలుసు ఆయనను గుర్తు చేసేలాగా శృతిహాసన్ కూడా ఈ సినిమాలో కామెడీ చేస్తుంది అని ప్రముఖ రైటర్ సాయి మాధవ్ బుర్ర కూడా హింట్ ఇచ్చారు. దీంతో ఈ రెండు సినిమాలలో శృతిహాసన్ పాత్ర చూడడానికి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.