Coronavirus: మళ్లీ మొదలైన కరోనా కలకలం.. మహేష్ కుటుంబంలో అలజడి
Shilpa Shirodkar Tests Positive for Coronavirus: హిందీ బిగ్‌బాస్ సీజన్ 18లో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న బాలీవుడ్ నటి, మహేష్ బాబు మరదలు శిల్పా శిరోద్కర్‌కు కోవిడ్ పాజిటివ్‌గా తేలింది.
Coronavirus: మళ్లీ మొదలైన కరోనా కలకలం.. మహేష్ కుటుంబంలో అలజడి
Shilpa Shirodkar Tests Positive for Coronavirus: కరోనా మహమ్మారి మరోసారి ప్రపంచంపై దండెత్తడానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే పలు దేశాల్లో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. కాగా తాజాగా భారత్‌లో కూడా కేసులు మొదలయ్యాయి. కాగా ఇటీవల ప్రముఖ నటి కరోనా బారిన పడినట్లు అధికారికంగా ప్రకటించారు.
హిందీ బిగ్‌బాస్ సీజన్ 18లో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న బాలీవుడ్ నటి, మహేష్ బాబు మరదలు శిల్పా శిరోద్కర్‌కు కోవిడ్ పాజిటివ్‌గా తేలింది. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా వేదికగా ప్రకటించించారు. మిత్రులారా! నాకు కోవిడ్ పాజిటివ్ అని తేలింది. దయచేసి జాగ్రత్తగా ఉండండి. మాస్క్ ధరించండి.ష అంటూ రాసుకొచ్చారు.
ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అభిమానులు ఆమెకు “స్టే సేఫ్ మేడమ్”, “టేక్ కేర్”, “గెట్ వెల్ సూన్” అంటూ స్పందిస్తున్నారు. అంతేకాదు, ఆమె సోదరి నమ్రతా శిరోద్కర్ కూడా ఈ విషయంపై స్పందించింది. శిల్పా పోస్ట్‌కి లవ్ ఎమోజీలతో రిప్లై ఇచ్చింది. ఆమె వెంటనే కోలుకోవాలని ఆకాంక్షిస్తూ నమ్రత స్పందించింది.
ఇక శిల్పాకి సంఘీభావం తెలియజేస్తూ, సోనాక్షి సిన్హా, సోనాలి బింద్రే, డయానా పాండే వంటి ప్రముఖ నటీమణులూ మద్దతుగా నిలిచారు. తన ఆరోగ్యం పట్ల ఆందోళన చెందుతున్న అభిమానులు, సినీ ప్రముఖులు శిల్పా త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.
ఇప్పటికే దేశవ్యాప్తంగా మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో, సామాన్యులు మాత్రమే కాకుండా సెలెబ్రిటీలు కూడా ఈ వైరస్ బారిన పడుతున్నారు. ఇటీవలే ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కి చెందిన ఆటగాడు ట్రావిస్ హెడ్ కరోనా సోకినట్లు వెల్లడైంది.