Shilpa Shetty: "సాగరకన్య" రీ ఎంట్రీ? ప్రభాస్, ఎన్టీఆర్ సినిమాలతోనేనా..

Shilpa Shetty: దేశంలోని ప్రముఖ హీరోయిన్స్‌లో శిల్పా శెట్టి ఒకరు. అయితే, తన పునరాగమనానికి చాలా కష్టపడుతోంది ఈ సాగర కన్య.

Update: 2021-03-31 10:17 GMT

శిల్పా శెట్టి (ఫొటో: ది హన్స్ ఇండియా)

Shilpa Shetty: దేశంలోని ప్రముఖ హీరోయిన్స్‌లో శిల్పా శెట్టి ఒకరు. అయితే, తన పునరాగమనానికి ప్రయత్నాలు మొదలుపెట్టిందంట ఈ సాగర కన్య. ప్రస్తుతం సౌత్ ఇండ్రస్ట్రీలో పాగా వేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

తాజా సమాచారం మేరకు, శిల్పాశెట్టి ఇద్దరు స్టార్ హీరోలతో తెలుగులో రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైందని టాక్. నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో ప్రభాస్ ఓ సినిమా ప్లాన్ చేస్తున్నట్లు తెలిసిందే. ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో ఈ పొడుగు కాళ్ల సుందరిని నటింప జేసేందుకు మూవీ టీం చర్చులు చేస్తున్నట్లు సమాచారం. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, దీపికా పదుకునే లాంటి అగ్ర నటులు భాగం కానున్నారు. ఈ సినిమాలో శిల్పా శెట్టి నటిస్తునట్లు వస్తున్న వార్తలను మేకర్స్ ఇంకా ధృవీకరించలేదు.

మరోవైపు, త్రివిక్రమ్ దర్శకత్వంలో ఆమె ఎన్టీఆర్ తరువాతి సినిమా కోసం చర్చలు జరుపుతోంది. నివేదికల మేరకు, ఆమె ఈ చిత్రంలో రాజకీయ నాయకురాలిగా కనిపిస్తుంది. పూర్తి విషయాలు తెలవాలంటే మాత్రం అఫిషీయల్ ఎనౌన్స్‌మెంట్ వచ్చే వరకు ఆగాల్సిందే. అయితే, శిల్పా శెట్టి, రీ ఎంట్రీ చాలా స్ట్రాంగ్ గా ఉండాలని కోరుకుంటుందని తెలుస్తోంది.

Tags:    

Similar News