Jawan Movie Twitter Review: బ్లాక్ బస్టర్ హిట్.. షారుఖ్ ఖాన్ 'జవాన్' ట్విట్టర్ రివ్యూ..!
Jawan Movie Review: షారుఖ్ ఖాన్ 'జవాన్' సినిమా ఈరోజు అంటే సెప్టెంబర్ 7న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది.
Jawan Movie Twitter Review: బ్లాక్ బస్టర్ హిట్.. షారుఖ్ ఖాన్ 'జవాన్' ట్విట్టర్ రివ్యూ..!
Jawan Movie Review: షారుఖ్ ఖాన్ 'జవాన్' సినిమా ఈరోజు అంటే సెప్టెంబర్ 7న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూశారు. ఈ సినిమాపై జనాల్లో విపరీతమైన క్రేజ్ ఉంది. విడుదలకు ముందే ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ ద్వారా రూ. 51.17 కోట్ల బిజినెస్ చేసింది. సినిమా ట్రైలర్ నుంచి పాటల వరకు అన్నీ అద్భుతంగా ఉన్నాయి. విడుదలకు ఒకరోజు ముందు 'జవాన్' పాటల జ్యూక్‌బాక్స్‌ని విడుదల చేశారు. ఉదయం ఫస్ట్ షో చూసేందుకు థియేటర్ల వద్దకు భారీగా ఫ్యాన్స్ చేరుకున్నారు. అంతే కాదు థియేటర్ల బయట కూడా సందడి నెలకొంది. షారుఖ్ ఖాన్ సినిమాని పండగలా సెలబ్రేట్ చేస్తున్నారు. సినిమా చూసిన వారంతా సోషల్ మీడియాలో తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ఈ సినిమా చూస్తున్న వారందరూ 'జవాన్' బ్లాక్‌బస్టర్ హిట్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
జవాన్‌లో షారుక్‌తో పాటు నయనతార, సన్యా మల్హోత్రా, ప్రియమణి, విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలు పోషించారు. అట్లీ డైరెక్షన్‌లో రూపొందిన జవాన్ సినిమాపై పొగడ్తల వర్షం కురుస్తోంది. ఈసినిమా హిందీతో పాటు తమిళం, తెలుగు భాషల్లో కూడా విడుదలైంది.