Shaakuntalam Movie: పాత సినిమాలను గుర్తుకు తెస్తున్న సమంతా సినిమా

Shaakuntalam Movie: ఎన్టీఆర్ సినిమా ని తలపిస్తున్న శాకుంతలం

Update: 2022-02-24 06:30 GMT

పాత సినిమాలను గుర్తుకు తెస్తున్న సమంతా సినిమా

Shaakuntalam Movie: టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత హీరోయిన్గా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమా "శాకుంతలం". ప్రముఖ డైరెక్టర్ గుణశేఖర్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. పురాణాల లోని శకుంతల మరియు దుష్యంతుడి ప్రేమ కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనుంది. అయితే ఈ సినిమా కంటే ముందుగా శకుంతల అనగానే అందరికీ గుర్తొచ్చేది లెజెండరీ నటుడు ఎన్టీఆర్ మరియు సరోజా దేవీలు నటించిన శకుంతల సినిమా. 1966లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇక మరోవైపు 1941లో శాంతారామ్ కూడా ఈ కథ మీద ఒక సినిమా చేయగా, అందులో జయశ్రీ శకుంతల పాత్రలో కనిపించారు.

శకుంతల మరియు దుష్యంతుడ ప్రేమ కథ లో ఉండే డెప్త్ ఈ రెండు సినిమాలు చూస్తే తెలుస్తుంది. ఈ రెండు సినిమాలు టాలీవుడ్ లోనే ఒక ట్రెండ్ ని సృష్టించాయి. మరి గుణశేఖర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఎంతవరకు ఈ రెండు సినిమాల అభిమానులకు నచ్చుతుందో ఇంకా తెలియాల్సి ఉంది. పైగా ఈ సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ కూడా భారీగానే ఉండబోతున్నాయి. తాజా సమాచారం అయితే సినిమా హిట్ అవ్వాలంటే విజువల్ ఎఫెక్ట్స్ మాత్రమే కాకుండా కథ మరియు స్క్రీన్ ప్లే కూడా అంతే కీలకం. మరి "శాకుంతలం" ఎంతవరకు అలరిస్తుందో చూడాలి.

Tags:    

Similar News