Serial Actress Lahari: ఆక్సిడెంట్ కేసులో సీరియల్ నటి లహరి అరెస్ట్
Serial Actress Lahari: తెలుగు సీరియళ్లలో ప్రధాన పాత్రల్లో నటించిన లహరి యాక్సిడెంట్ కేసులో అరెస్టు అయింది. శంషాబాద్ నుంచి వస్తున్న లహరి ఎదురుగా వస్తున్న ఒక ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఒక వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. ఆ వ్యక్తి రక్తమోడుతున్నా కూడా కనీసం లహరి కారులోంచి దిగకపోవడంతో స్థానికులంతా ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు లహరిని కారుతో సహా శంషాబాద్ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. మద్యం సేవించి లహరి కారు నడిపినట్టు వార్తలు వినిపిస్తున్న ఇప్పటివరకూ పోలీసుల నుండి అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. ప్రస్తుతం గృహలక్ష్మి అనే సీరియల్ లో లహరి నటిస్తోంది.