విజయ్ దేవరకొండ బ్లాక్ బస్టర్ కి సీక్వెల్ ప్లాన్స్..

Vijay Deverakonda: విజయ్ దేవరకొండ సూపర్ హిట్ సినిమాకి సీక్వెల్ ప్లాన్ చేస్తున్న దర్శకనిర్మాతలు

Update: 2023-02-02 04:30 GMT

విజయ్ దేవరకొండ బ్లాక్ బస్టర్ కి సీక్వెల్ ప్లాన్స్..

Vijay Deverakonda: 2018 లో విజయ్ దేవరకొండ మరియు రష్మిక మందన్న హీరో హీరోయిన్లుగా నటించిన "గీతగోవిందం" సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కేవలం ఐదు కోట్ల బడ్జెట్ తో ఒక రొమాంటిక్ కామెడీ సినిమాగా ప్రేక్షకుల ముందుకి వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 100 కోట్లకు పైగానే కలెక్షన్లను అందుకుంది. ఈ సినిమాలో విజయ్ మరియు రష్మికల కెమిస్ట్రీ సినిమాకి అతిపెద్ద హైలైట్ గా నిలిచింది.

ఈ సినిమా సూపర్ హిట్ అయినప్పటి నుంచే విజయ్ మరియు రష్మికలు ప్రేమలో ఉన్నారు అని పుకార్లు కూడా మొదలయ్యాయి. తాజాగా ఇప్పుడు ఈ సినిమా కి ఒక సీక్వల్ ని దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం గీతగోవిందం సినిమాకి సీక్వెల్ కోసం చర్చలు జరుగుతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సూపర్ హిట్ సినిమాకి సీక్వెల్ అనగానే అభిమానులు కూడా చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

పైగా మరొకసారి విజయ్ దేవరకొండ మరియు రష్మిక ల కెమిస్ట్రీని వెండితెరపై చూడడానికి అభిమానులు రెడీగా ఉన్నారు. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన మాత్రం ఇంకా వెలువడాల్సి ఉంది. గీతగోవిందం సినిమాకి పరశురామ్ దర్శకత్వం వహించారు. జిఏ 2 పిక్చర్స్ పతాకంపై బన్నీ వాస్ ఈ సినిమాని నిర్మించారు. సుబ్బరాజు, రాహుల్ రామకృష్ణ, రవి ప్రకాష్, తదితరులు ముఖ్య పాత్రలు పోషించిన ఈ సినిమాలో అను ఇమ్మాన్యువల్ మరియు నిత్యామీనన్ లు కామియో పాత్రలలో కనిపించారు.

Tags:    

Similar News