Prabhas: "రాజా డీలక్స్" కోసం సీనియర్ బాలీవుడ్ హీరో

Prabhas: ఈ మధ్యనే "రాధే శ్యామ్" సినిమాతో డిజాస్టర్ అందుకున్న ప్రభాస్ చేతిలో ఇప్పుడు బోలెడు బడా ప్రాజెక్టులు ఉన్న సంగతి తెలిసిందే.

Update: 2022-09-25 09:30 GMT

Prabhas: "రాజా డీలక్స్" కోసం సీనియర్ బాలీవుడ్ హీరో

Prabhas: ఈ మధ్యనే "రాధే శ్యామ్" సినిమాతో డిజాస్టర్ అందుకున్న ప్రభాస్ చేతిలో ఇప్పుడు బోలెడు బడా ప్రాజెక్టులు ఉన్న సంగతి తెలిసిందే. అటు ప్యాన్ ఇండియన్ సినిమాలతో బిజీగా ఉన్న ప్రభాస్ ఇటు మారుతీ దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేయడానికి సైన్ చేశారు. హారర్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాకి "రాజా డీలక్స్" అనే టైటిల్ ని కూడా ఖరారు చేశారు దర్శకనిర్మాతలు.

అయితే టైటిల్ కి సంబంధించిన అధికారిక ప్రకటన మాత్రం ఇంకా వెలువడలేదు. అన్నీ భాష‌ల్లోనూ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించే ఒక టైటిల్ కోసం చిత్ర బృందం వెతుకుతోంది. తాజాగా ఈ సినిమాలో ఒక ప్రముఖ స్టార్ సీనియర్ బాలీవుడ్ హీరో కీలక పాత్రలో కనిపించనున్నారు అని వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఆ హీరో ఎవరు అనే విషయంపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.

అయితే ఇది ఒక పతబడిపోయిన థియేట‌ర్ నేప‌థ్యంలో సాగే క‌థ‌ అని సమాచారం. బొమ‌న్ ఇరానీని సినిమాలో ఓ కీల‌క పాత్ర చేయనున్నట్టు స‌మాచారం. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ పట్టలెక్కే అవకాశాలు ఎక్కువగానే ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు ప్రభాస్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో "సలార్", నాగ్ అశ్విన్ డైరెక్షన్లో "ప్రాజెక్ట్ కే", ఓం రౌత్ దర్శకత్వంలో "ఆది పురుష్", సందీప్ వంగా డైరెక్షన్లో "స్పిరిట్" వంటి సినిమాలతో కూడా బిజీగా ఉన్నారు. 

Tags:    

Similar News