Shekar Master: డ్యాన్సర్లకు అండగా శేఖర్ మాస్టర్
Shekar Master: ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ డ్యాన్సర్లకు అండగా నిలిచారు.
Choreographer Sekhar Master:(File Image)
Shekar Master: లాక్‌డౌన్ కారణంగా పనిలేక ఎంతో మంది తినడానికి తిండి కూడా లేక అవస్థలు పడుతున్నారు. రోజు పనిచేస్తే తప్ప ఐదు వేళ్లు నోట్లోకి వెళ్లని పరిస్థితి మన సమాజంలో ఎంతో మంది ఉంది. అందులో సినిమా పరిశ్రమ ఒకటి. ఈ క్రమంలోనే తాజాగా ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ డ్యాన్సర్లకు అండగా నిలిచారు.
లాక్‌డౌన్ కారణంగా షోలు లేక ఉపాధి కోల్పోయిన డ్యాన్సర్లకు తనవంతు సహాయాన్ని అందించేందుకు ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రూపు డ్యాన్సర్లు, టీవీ షోలు చేసే డ్యాన్సర్లకు ఈ సమయంలో పని దొరకడం చాలా కష్టంగా మారిందని చెప్పుకొచ్చారు. ఏదైనా టీవీ షోలు, కార్యక్రమాలు జరిగితే తప్ప వాళ్లకు పని ఉండదన్న శేఖర్ మాస్టర్.. భోజనానికి కూడా డబ్బులు లేక చాలా మంది ఇబ్బందులు పడుతున్నారని ఆయన చెప్పుకొచ్చారు.
ఈ కరోనా సమయంలో ఇలా ఎవరైనా ఇబ్బందులు పడుతుంటే వెంటనే తనకు ఫోన్ చేసి చెప్పమని శేఖర్ మాస్టర్ ప్రకటించారు. అలాంటి వారికి తన టీమ్ సభ్యులు అవసరమైన సరుకులు అందిస్తారని చెప్పుకొచ్చారు. అవసరం అనుకున్న వాళ్ళు 9989189885,9619861492,7416519257 కి ఫోన్ చేసి నిత్యావసర సరుకులు తీసుకోవచ్చని శేఖర్ మాస్టర్ తెలిపారు.