Varalaxmi Sarathkumar: వరలక్ష్మి పెళ్లికి రూ. 200 కోట్లు ఖర్చు చేశారా.? శరత్ కుమార్ ఏమన్నారంటే.?
Varalaxmi Sarathkumar: నటి వరలక్ష్మి శరత్ కుమార్ మూడు ముళ్ల బంధంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే.
Varalaxmi Sarathkumar: వరలక్ష్మి పెళ్లికి రూ. 200 కోట్లు ఖర్చు చేశారా.? శరత్ కుమార్ ఏమన్నరాంటే..?
Varalaxmi Sarathkumar: నటి వరలక్ష్మి శరత్ కుమార్ మూడు ముళ్ల బంధంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ముంబయికి చెందిన ఆర్ట్ గ్యాలరిస్ట్ నికోలాయ్ సచ్‌దేవ్‌తో వరలక్ష్మి వివాహం అంగరంగవైభవంగా జరిగింది. జులై 2వ తేదీన థాయ్‌లాండ్ వేదికగా ఘనంగా జరిగింది. ఈ వేడుకలో సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. అనంతరం చెన్నైలోని తాజ్ హోటల్‌లో ఘనంగా రిసెప్షన్ వేడుకను నిర్వహించారు.
వరలక్ష్మి వివాహానికి సంబంధించి ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అయ్యాయి. అయితే ఇదే సమయంలో వరలక్ష్మి వివాహా ఖర్చుకు సంబంధించి కూడా ఓ వార్త తెగ ట్రెండ్ అవుతోంది. ఈ పెళ్లికి ఏకంగా రూ. 200 కోట్లకుపైగా ఖర్చు చేశారని నెట్టింట వార్తలు వైరల్ అయ్యాయి. అయితే ఇదే విషయంపై వరలక్ష్మి తండ్రి శరత్ కుమార్ స్పందించారు. తన కూతురి పెళ్లికి రూ. 200 కోట్లు ఖర్చు చేశారన్నదానిపై బదులిచ్చారు.
ఈ విషయమై ఆయన మాట్లాడుతూ.. ‘అంత డబ్బు ఎక్కడుందో నాకు తెలియదు. అలాంటి వార్తలు పూర్తిగా అవాస్తవం. ఏమీ తెలియక తప్పుడు సమాచారం ప్రచారం చేస్తున్నారు. పెళ్లి కోసం అంత ఖర్చు చేయడం ఏంటి..? చాలా సింపుల్ గానే నా బిడ్డ పెళ్లి చేశాను. నిజాలు ఏంటో తెలియకుండానే ఊహించుకొని తప్పుడు వార్తలు ప్రచారం చేయకండి’ అని చెప్పుకొచ్చారు. ఇలా తన కూతురు పెళ్లి ఖర్చుకి సంబంధించి జరుగుతోన్న రుమార్స్‌కి చెక్ పెట్టేశారు.
ఇదిలా ఉంటే వరలక్ష్మి భర్త నికోలాయ్ ముంబయికి చెందిన అత్యంత సంపన్నుల్లో ఒకరు. నికోలాయ్‌కి సొంత ఆర్ట్ గ్యాలరీ ఉంది. ఇతనికి సుమారు రూ. 900 కోట్ల ఆస్తి ఉంటుందని నెట్టింట వార్తలు వైరల్ అవుతున్నాయి. మరి ఇందులో కూడా ఎంత వరకు నిజం ఉందో తెలియదు.