OTT: ఒకేసారి టీవీలో, ఓటీటీలో.. సంక్రాంతికి వస్తున్నాం సరికొత్త ట్రెండ్.. ఎప్పటి నుంచంటే..
OTT: తాజాగా వెంకటేష్ హీరోగా వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా సరికొత్త పంథాను ఎంచుకుంది. ఒకేసారి ఓటీటీతో పాటు టీవీలో వచ్చేందుకు సిద్ధమవుతోంది సంక్రాంతికి వస్తున్నాం మూవీ.
OTT: ప్రస్తుతం ఓటీటీల హవా నడుస్తోంది. దీంతో టీవీల్లో సినిమాల కోసం ఎదురు చూసే వారి సంఖ్య తగ్గిపోతోంది. అయితే తాజాగా వెంకటేష్ హీరోగా వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా సరికొత్త పంథాను ఎంచుకుంది. ఒకేసారి ఓటీటీతో పాటు టీవీలో వచ్చేందుకు సిద్ధమవుతోంది సంక్రాంతికి వస్తున్నాం మూవీ.
ఎఫ్ 2, ఎఫ్ 3 వంటి విజయాల తర్వాత విక్టరీ వెంకటేశ్, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వచ్చిన తాజా చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’. జనవరి 14న విడుదలైన ఈ సినిమా ఎంతటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సంక్రాంతికి విడుదలైన అన్ని చిత్రాల్లో ఈ ఒక్క సినిమానే విజయాన్ని నమోదు చేసుకుంది. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచి, రూ. 300 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. వెంకటేశ్ కెరీర్‌లోనే ఇది అతిపెద్ద హిట్‌గా నిలిచింది.
థియేటర్లలో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ సినిమా, ఓటీటీలో ఎప్పుడు వస్తుందా? అనే ఆసక్తి నెలకొంది. అయితే, మేకర్స్ ఓటీటీకి ముందుగా టీవీలో ప్రసారం చేయనున్నట్లు వెల్లడించారు. తాజాగా, టీవీ ప్రీమియర్‌తో పాటు అదే సమయంలో ఓటీటీలోనూ విడుదల చేయనున్నట్లు తెలిపారు. ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులు, శాటిలైట్ రైట్స్ జీ5 సొంతం చేసుకుంది. ఈ క్రమంలో మార్చి 1న సాయంత్రం 6 గంటల నుంచి జీ తెలుగు ఛానెల్‌తో పాటు జీ5 ఓటీటీలోనూ స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ సినిమా అందుబాటులో ఉంటుంది. ఒకవేళ ఈ సినిమాను థియేటర్లలో చూడలేకపోయినా.? మళ్లీ చూడాలనుకుంటున్నా. టీవీ లేదా ఓటీటీలో చూసేయండి. మరి థియేటర్లలో వసూళ్ల వర్షం కురిపించిన ఈ సినిమా బుల్లి తెరపై ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.