Sankranthiki Vasthunam OTT Version: ఇదేం ట్విస్ట్‌ భయ్యా.. 'సంక్రాంతికి వస్తున్నాం' ఓటీటీ వెర్షన్‌లో ఈ మార్పు గమనించారా?

Sankranthiki Vasthunam OTT Version: ప్రస్తుతం ఓటీటీల హవా నడుస్తోంది. ఒకప్పుడు థియేటర్లలో సినిమా చూడని వారు టీవీలో వచ్చేంత వరకు ఎదురు చూసే వారు.

Update: 2025-03-02 05:14 GMT

Sankranthiki Vasthunam OTT Version: ఇదేం ట్విస్ట్‌ భయ్యా.. 'సంక్రాంతికి వస్తున్నాం' ఓటీటీ వెర్షన్‌లో ఈ మార్పు గమనించారా?

Sankranthiki Vasthunam OTT Version: ప్రస్తుతం ఓటీటీల హవా నడుస్తోంది. ఒకప్పుడు థియేటర్లలో సినిమా చూడని వారు టీవీలో వచ్చేంత వరకు ఎదురు చూసే వారు. కానీ ప్రస్తుతం థియేటర్‌లో విడుదలైన కేవలం నెల రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. ఆ తర్వాత టీవీల్లో ప్రసారమవుతున్నాయి. అటు థియేటర్‌కు వెళ్లని వారు, ఇటు ఓటీటీ సబ్‌స్క్రిప్షన్‌ లేని వారు మాత్రమే టీవీలో సినిమాలు చూసే రోజులు వచ్చాయ్‌.

అయితే తాజాగా సంక్రాంతికి వస్తున్నాం సినిమా సరికొత్త ట్రెండ్‌కు శ్రీకారం చుట్టింది. ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాను శనివారం నుంచి ఓటీటీలోకి అందుబాటులోకి తీసుకొచ్చారు. అయితే సరిగ్గా అదే సమయానికి జీ తెలుగులోనూ సినిమా ప్రదర్శించడం విశేషం. ఇలా టీవీలో ఓటీటీలో ఒకేసారి అందుబాటులోకి వచ్చిన చిత్రంగా ఈ సినిమా కొత్త ఒరవడిని సృష్టించింది.

అయితే ఓటీటీలో చిత్ర యూనిట్ ఓ ట్విస్ట్‌ను ఇచ్చింది. థియేటర్‌లో 2 గంటల 24 నిమిషాలుగా ఉన్న ఈ చిత్రం, జీ5లో 2 గంటల 16 నిమిషాలకు కుదించారు. సహజంగా థియేటర్‌ కంటే ఓటీటీలో ఎక్కువ నిడివి ఉంటుంది. కానీ సంక్రాంతికి వస్తున్నాం మూవీలో మాత్రం ఇది రివర్స్‌గా జరిగింది. కొన్ని కామెడీ సన్నివేశాలను ఓటీటీలో యాడ్‌ చేస్తారని ప్రచారం జరిగినా, అసలు నిడివి తగ్గిపోయిందని తెలుస్తోంది.

ఫ్లాష్‌బ్యాక్‌లో మీనాక్షి చౌదరి, వెంకటేశ్‌ల మధ్య ఉన్న దృశ్యాలు జోడించనున్నట్లు వార్తలు వచ్చినా, అదనపు సన్నివేశాల విషయం పక్కనపెడితే, ఉన్న సన్నివేశాలకే కత్తెర వేసినట్లు అనిపిస్తోంది. ఇంతకుముందు పలు సినిమాలు ఓటీటీలో అదనపు నిడివితో వచ్చాయి. ఈ సినిమాను అందుకు భిన్నంగా విడుదల చేశారు. కాగా వెంకటేశ్‌, ఐశ్వర్య రాజేశ్‌, మీనాక్షి చౌదరి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద రూ.300 కోట్లకు పైగా వసూలు చేసి భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. 

Tags:    

Similar News