Hebah Patel: హాట్ హీరోయిన్ హెబ్బా పటేల్ మిరాకిల్ ఎంట్రీ
Hebah Patel: 'కుమారి 21ఎఫ్' ఫేమ్ హెబ్బా పటేల్ తాజాగా నటిస్తున్న ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్టైనర్ "మిరాకిల్".
Hebah Patel: హాట్ హీరోయిన్ హెబ్బా పటేల్ మిరాకిల్ ఎంట్రీ
Hebah Patel: 'కుమారి 21ఎఫ్' ఫేమ్ హెబ్బా పటేల్ తాజాగా నటిస్తున్న ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్టైనర్ "మిరాకిల్". ప్రభాస్ నిమ్మల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి ఒక క్రేజీ అప్‌డేట్ బయటకు వచ్చింది. ఈ చిత్రం మూడో షెడ్యూల్ ఈనెల 24 (ఫిబ్రవరి 24) నుంచి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ప్రారంభం కానుంది. ఈ షెడ్యూల్‌లో హీరోయిన్ హెబ్బా పటేల్ సెట్స్‌లో జాయిన్ కాబోతున్నారు.
రణధీర్ భీసు హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో సీనియర్ హీరోలు శ్రీరామ్, సురేష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న ఈ సినిమాలో నాయుడు పెండ్ర విలన్‌గా పరిచయమవుతున్నారు. సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ ధీరజ అప్పాజీ ఫోరెన్సిక్ ఆఫీసర్‌గా నటిస్తుండగా.. ఆమని, ఝాన్సీ, దిల్ రమేష్ వంటి భారీ తారాగణం ఇతర ముఖ్య పాత్రల్లో కనిపిస్తున్నారు.
సైదా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై రమేష్ ఎగ్గిడి, శ్రీకాంత్ మొగదాసు, చందర్ గౌడ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నిర్మాతలు మాట్లాడుతూ.. "గతంలో 'సత్యా గ్యాంగ్', 'ఫైటర్ శివ' చిత్రాలతో దర్శకుడిగా సత్తా చాటుకున్న ప్రభాస్ నిమ్మల, ఈ చిత్రంతో బాక్సాఫీస్ వద్ద 'మిరాకిల్' చేయబోతున్నారు. హెబ్బా పటేల్ గ్లామర్, సీనియర్ నటుల పెర్ఫార్మెన్స్ మరియు హై-వోల్టేజ్ యాక్షన్ బ్లాక్స్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి" అని తెలిపారు. యాక్షన్ ప్రియులను అలరించేందుకు సిద్ధమవుతున్న ఈ చిత్రం, ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.