Vishwambhara Release Date: బ్లాక్ బస్టర్ సెంటిమెంట్.. మెగాస్టార్ 'విశ్వంభర' కోసం రెండు డేట్స్?

Vishwambhara Release Date: మెగాస్టార్ చిరంజీవి 2026 సంక్రాంతికి వచ్చిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమాతో ఇండస్ట్రీ బ్లాక్‌బస్టర్ అందుకుని అభిమానులను అలరించిన సంగతి తెలిసిందే.

Update: 2026-02-18 13:34 GMT

Vishwambhara Release Date: బ్లాక్ బస్టర్ సెంటిమెంట్.. మెగాస్టార్ 'విశ్వంభర' కోసం రెండు డేట్స్?

Vishwambhara Release Date: మెగాస్టార్ చిరంజీవి 2026 సంక్రాంతికి వచ్చిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమాతో ఇండస్ట్రీ బ్లాక్‌బస్టర్ అందుకుని అభిమానులను అలరించిన సంగతి తెలిసిందే. చిరు నుంచి కామెడీ వచ్చి చాలా రోజులవ్వడంతో ముఖ్యంగా మెగా ఫాన్స్ పండగ చేసుకున్నారు. ఇప్పుడు చిరు తదుపరి భారీ ప్రాజెక్ట్ 'విశ్వంభర' కోసం మెగా ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ముందుగా ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని భావించిన మేకర్స్.. తరువాత సమ్మర్ రిలీజ్ అని చెప్పారు. సమ్మర్ వస్తున్నా.. ఇప్పటివరకు అధికారిక రిలీజ్ డేట్ మాత్రం ప్రకటించలేదు.

సోషల్ మీడియాలో మాత్రం విశ్వంభర విడుదల తేదీపై ఎన్నో వార్తలు వైరల్ అవుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం.. జులై 2026లో సినిమా విడుదలకు మెలర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. జులై10 లేదా జులై 24 తేదీలను పరిశీలిస్తున్నారని టాక్. ఇందులో జులై 24 తేదీకి ప్రత్యేకమైన సెంటిమెంట్ కూడా ఉంది. ఎందుకంటే చిరంజీవి నటించిన 'ఇంద్ర' అదే తేదీన విడుదలై.. భారీ విజయాన్ని సాధించింది. అందుకే జులై 24 తేదీని ఫైనల్ చేసే అవకాశం ఉందని సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. అయితే ఈ విషయంపై చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ప్రస్తుతం విశ్వంభర మూవీ వీఎఫ్ఎక్స్ పనుల్లో బిజీగా ఉందని సమాచారం. గ్రాఫిక్స్ విషయంలో ఎలాంటి రాజీ పడకుండా అత్యున్నత స్థాయి విజువల్ అనుభూతి ఇవ్వాలనే లక్ష్యంతో మేకర్స్ సమయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ప్రపంచంలోనే టాప్‌ వీఎఫ్‌ఎక్స్‌ కంపెనీలు విశ్వంభర కోసం పనిచేస్తున్నాయి. ఈ చిత్రాన్ని దర్శకుడు మల్లాడి వశిష్ఠ తెరకెక్కిస్తుండగా.. హీరోయిన్‌గా చెన్నై చిన్నది త్రిష కృష్ణన్ నటిస్తోంది. ఇందులో హాట్ బ్యూటీ ఆషికా రంగనాథ్ నటిస్తున్న విషయం తెలిసిందే. సంగీతాన్ని ఎంఎం కీరవాణి అందిస్తుండగా.. భారీ బడ్జెట్‌తో అవి క్రియేషన్స్ నిర్మిస్తోంది. మొత్తానికి రిలీజ్ డేట్‌పై వస్తున్న ఊహాగానాలకు తెరపడాలంటే.. అధికారిక ప్రకటన వచ్చే వరకు అభిమానులు వేచి చూడాల్సిందే. సోషియో-ఫాంటసీ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి.

Tags:    

Similar News