Vijay Deverakonda & Rashmika విజయ్-రష్మికల వెడ్డింగ్.. వాళ్లకు నో ఎంట్రీ

Vijay Deverakonda and Rashmika Mandanna: టాలీవుడ్ మోస్ట్ అడోరబుల్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల పెళ్లి వార్త ఇప్పుడు నెట్టింట మారుమోగిపోతోంది.

Update: 2026-02-18 03:31 GMT

Vijay Deverakonda & Rashmika విజయ్-రష్మికల వెడ్డింగ్.. వాళ్లకు నో ఎంట్రీ 

Vijay Deverakonda and Rashmika Mandanna: టాలీవుడ్ మోస్ట్ అడోరబుల్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల పెళ్లి వార్త ఇప్పుడు నెట్టింట మారుమోగిపోతోంది. గత కొన్నేళ్లుగా వీరిద్దరి రిలేషన్‌షిప్‌పై రకరకాల ఊహాగానాలు వస్తున్నప్పటికీ, ఇప్పుడు ఏకంగా పెళ్లి తేదీ, వేదిక ఖరారయ్యాయనే వార్త అభిమానుల్లో జోష్ నింపుతోంది.

వీరిద్దరి వివాహం ఈ నెల చివరలో, అంటే ఫిబ్రవరి 26న అత్యంత వైభవంగా జరగబోతున్నట్లు తెలుస్తోంది. రాజస్థాన్‌లోని చారిత్రాత్మక నగరం ఉదయ్‌పూర్ ఈ వేడుకకు వేదిక కానుంది. ఇప్పటికే పెళ్లి కార్డు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండటంతో అభిమానుల ఆనందానికి అవధులు లేవు.

బాలీవుడ్ స్టార్ జంటల తరహాలోనే విజయ్-రష్మిక కూడా తమ వివాహ వేడుకను అత్యంత గోప్యంగా ఉంచాలని నిర్ణయించుకున్నారు. అందుకే పెళ్లి వేదిక వద్ద నో ఫోన్ పాలసీ అమలు చేయబోతున్నారట. అతిథులు ఎవరూ ఫొటోలు తీయకుండా, వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టకుండా కఠినమైన నిబంధనలు విధిస్తున్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. పెళ్లి హడావుడి మొత్తం పూర్తయ్యాక, తమ అఫీషియల్ సోషల్ మీడియా ఖాతాల ద్వారానే ఫోటోలను పంచుకోవాలని ఈ జంట ప్లాన్ చేస్తోంది.

పెళ్లి ఉదయ్‌పూర్‌లో కేవలం కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్య జరిగినా.. చిత్ర పరిశ్రమ మిత్రుల కోసం మార్చి 4వ తేదీన హైదరాబాద్‌లో భారీగా రిసెప్షన్ నిర్వహించబోతున్నారట. ఈ వేడుకకు టాలీవుడ్, బాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యే అవకాశం ఉంది.




Tags:    

Similar News