Athadu Re-Release: 'మళ్ళీ థియేటర్లలో మహేష్ త్రివిక్రమ్ మ్యాజిక్.. అతడి కోసం ఫ్యాన్స్ రెడీ!

Athadu Re-Release: టాలీవుడ్‌లో రీ-రిలీజ్ సినిమాల ట్రెండ్ కొనసాగుతోంది. ఈ క్రమంలోనే సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న 'అతడు' చిత్రం మళ్లీ వెండితెరపై అలరించడానికి సిద్ధమైంది.

Update: 2026-02-19 08:54 GMT

Athadu Re-Release: 'అతడు' మేనియా షురూ.. 70MM స్క్రీన్‌పై పార్థు గర్జన.. రీ-రిలీజ్ డేట్ ఫిక్స్!

Athadu Re-Release: టాలీవుడ్‌లో రీ-రిలీజ్ సినిమాల ట్రెండ్ కొనసాగుతోంది. ఈ క్రమంలోనే సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న 'అతడు' చిత్రం మళ్లీ వెండితెరపై అలరించడానికి సిద్ధమైంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో 2005లో విడుదలైన ఈ క్లాసిక్ మూవీ, ఫిబ్రవరి 28న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో పునర్విడుదల కానుంది.

మహేష్ బాబు కెరీర్‌లో 'అతడు' ఒక మైలురాయి. ఇందులో 'పార్థు'గా మహేష్ సెటిల్డ్ పర్ఫార్మెన్స్, పదునైన పంచ్ డైలాగులు, బ్రహ్మానందం కామెడీ మరియు ఫ్యామిలీ ఎమోషన్స్ ఇప్పటికీ ప్రేక్షకులకు కొత్తగానే అనిపిస్తాయి. బుల్లితెరపై అత్యధిక సార్లు ప్రసారమై, అత్యధిక రేటింగ్స్ సాధించిన సినిమాగా రికార్డు సృష్టించిన ఈ చిత్రాన్ని మళ్లీ 70MM స్క్రీన్‌పై చూడాలని ఫ్యాన్స్ ఆతృతగా ఉన్నారు.

ఈ భారీ రీ-రిలీజ్‌ను నైజాం ఏరియాలో టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ ఏషియన్ సినిమాస్ విడుదల చేస్తోంది. ఇక ఆంధ్ర, రాయలసీమ మరియు కర్ణాటక ప్రాంతాల్లో కాకినాడ టాకీస్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ద్వారా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

నైజాంతో పాటు ప్రధాన నగరాల్లో బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభం కాగా, మిగిలిన ప్రాంతాల్లో మరికొద్ది రోజుల్లో బుకింగ్స్ ఓపెన్ కానున్నాయి. రీ-రిలీజ్‌లలో కూడా రికార్డు స్థాయి వసూళ్లు సాధించే దిశగా ఈ సినిమా ట్రెండ్ సెట్ చేస్తోందని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. క్లాస్ ప్లస్ మాస్ ఎలిమెంట్స్‌తో కూడిన ఈ మ్యాజిక్‌ను థియేటర్లలో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి ఘట్టమనేని అభిమానులు సిద్ధమవుతున్నారు.

Tags:    

Similar News