Anupama Parameswaran: ఆ హీరో కొడుకుతో సమ్‌థింగ్ సమ్‌థింగ్..అర్ధరాత్రి కూడా ఫోన్ చేస్తా అంటూ ఓపెన్

Anupama Parameswaran: సినిమా ప్రపంచంలో రీల్ లైఫ్ కెమిస్ట్రీ ఎప్పుడు రియల్ లైఫ్ వైపు మళ్లుతుందో ఎవరూ ఊహించలేరు.

Update: 2026-02-20 06:43 GMT

Anupama Parameswaran: ఆ హీరో కొడుకుతో సమ్‌థింగ్ సమ్‌థింగ్..అర్ధరాత్రి కూడా ఫోన్ చేస్తా అంటూ ఓపెన్

Anupama Parameswaran: సినిమా ప్రపంచంలో రీల్ లైఫ్ కెమిస్ట్రీ ఎప్పుడు రియల్ లైఫ్ వైపు మళ్లుతుందో ఎవరూ ఊహించలేరు. ప్రస్తుతం టాలీవుడ్ నుంచి కోలీవుడ్ వరకు వినిపిస్తున్న హాట్ టాపిక్.. మలయాళ కుట్టి అనుపమ పరమేశ్వరన్ , విక్రమ్ వారసుడు ధ్రువ్ విక్రమ్ మధ్య ఏదో నడుస్తోందని! ఈ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ కేవలం సినిమాలకే పరిమితం కాలేదని, అంతకు మించి ఏదో ఉందనే వార్తలు సోషల్ మీడియాలో జోరుగా షికారు చేస్తున్నాయి.

గత ఏడాది ఈ ఇద్దరూ కలిసి నటించిన 'బైసన్' సినిమా షూటింగ్ సమయం నుంచే వీరిద్దరూ మంచి స్నేహితులయ్యారు. అయితే, ఇటీవల ముంబైలో జరిగిన ఓ అవార్డు వేడుకలో వీరి మధ్య ఉన్న చొరవ చూశాక ఫ్యాన్స్ కు అనుమానం మరింత బలపడింది. స్టేజీపై ధ్రువ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పి సర్ ప్రైజ్ చేయడమే కాకుండా, అక్కడి హోస్ట్ అడిగిన ఒక ఆసక్తికర ప్రశ్నకు అనుపమ ఇచ్చిన సమాధానం ఇప్పుడు వైరల్ అవుతోంది.

అర్ధరాత్రి రెండు గంటలకు ఏదైనా అర్జెంట్ పని పడితే ఎవరికి కాల్ చేస్తారు? అని అడగ్గా.. ఏమాత్రం తడబడకుండా, ముసిముసి నవ్వులు చిందిస్తూ నేను ధ్రువ్‌కే ఫోన్ చేస్తాను అని అనుపమ చెప్పడం అందరినీ ఆశ్చర్యపరిచింది.

కేవలం మాటలే కాదు, ఇటీవల చెన్నై అవార్డు ఫంక్షన్లో కూడా ధ్రువ్, అనుపమ పక్కపక్కనే కూర్చుని సందడి చేశారు. ఆ సమయంలో ధ్రువ్ తన సోషల్ మీడియాలో అనుపమతో ఉన్న ఒక క్లోజ్ సెల్ఫీని షేర్ చేయడంతో నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. ఈ జంట చూడముచ్చటగా ఉంది, వీరు డేటింగ్ లో ఉన్నారా? అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.

ఒకవైపు కెరీర్ పరంగా అనుపమ 'క్రిష్టిందపురి' వంటి హిట్లతో దూసుకుపోతుంటే, మరోవైపు ధ్రువ్‌తో ఇలా వరుసగా కనిపిస్తూ వార్తల్లో నిలుస్తోంది. మరి ఈ అర్ధరాత్రి కాల్ వెనుక ఉన్నది కేవలం గాఢమైన స్నేహమేనా లేక జీవితాంతం తోడుండే బంధమా అనేది కాలమే నిర్ణయించాలి. ప్రస్తుతం ఈ ఇద్దరూ మౌనంగా ఉన్నా, వీరి కెమిస్ట్రీ మాత్రం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

Tags:    

Similar News